భారతదేశంలో కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ రూపంలో విజృంభిస్తోంది. ప్రముఖ సెలబ్రిటీలు వరుసగా కరోనా బారినపడటం ఆందోళణ కలిగిస్తోంది. గాన కోకిల, గాయని లతా మంగేష్కర్ కోవిడ్ 19 బారిన పడి ఆసుపత్రిలో చేరారు. దిగ్గజ గాయని ప్రస్తుతం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసియూలో చికిత్స పొందుతున్నారు. లతా మంగేష్కర్ తేలికపాటి లక్షణాలు ఉన్నాయని ఆమె మేనకోడలు రచన చెప్పారు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఆమెను ఐసీయూకి తరలించారు. సెప్టెంబరు 28, 1929న జన్మించిన లతా మంగేష్కర్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఫ్రాన్స్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం, ఆఫీసర్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్‌తో పాటు అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డుల పొందారు.
1974లో, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆమెను చరిత్రలో అత్యధికంగా రికార్డ్ చేయబడిన కళాకారిణిగా పేర్కొంది. ఆమె 1948, 1974 మధ్య 25,000 పాటలు పాడారు. లతా మంగేష్కర్ 2001లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న పొందారు. మూడేళ్ల కిందట కూడా లతా మంగేష్కర్ వైరల్ చెస్ట్ కంజెస్టిన్ కారణంగా ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత చికిత్స అనంతరం కోలుకున్నాయరు. ప్రస్తుతం ఆమె వృద్ధ్యాప్య వయస్సులో ఉండటంతో.. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. గాయని లతా మంగేష్కర్ త్వరగా కోలుకోవాలని.. ఆమె అభిమానులు ప్రార్థిస్తున్నారు.