భీమ్లా నాయక్.. వీర మాస్ లుక్ లో పవన్ కళ్యాణ్

Lala Bheemla Video Promo out today. పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, రానా ద‌గ్గుబాటి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న చిత్రం ‘భీమ్లా నాయ‌క్‌’.

By Medi Samrat  Published on  3 Nov 2021 11:56 AM IST
భీమ్లా నాయక్.. వీర మాస్ లుక్ లో పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, రానా ద‌గ్గుబాటి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న చిత్రం 'భీమ్లా నాయ‌క్‌'. మ‌ల‌యాళ చిత్రం 'అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్‌'కు తెలుగు రీమేక్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. తెలుగు నెటివిటీ తగ్గట్టు మార్పులు చేసే బాధ్యతలను ప్రముఖ ద‌ర్శ‌కుడు, రైట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ భుజాల మీదకు వేసుకున్నారు. ప‌వ‌న్‌కు జోడీగా నిత్యామీన‌న్ న‌టిస్తుండ‌గా, రానా జోడీగా సంయుక్తా మీన‌న్ న‌టిస్తున్నారు.

ఈ సినిమా బృందం ప్రమోషన్స్ విషయంలో మరింత దూసుకుపోతోంది. ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, టీజర్లు ఇప్పటికే మంచి కిక్ ను ఇస్తున్నాయి. ఇక దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా భీమ్లా నాయ‌క్ నుంచి మ‌రో క్రేజీ అప్‌డేట్‌ను అందించారు మేక‌ర్స్‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్ టీజ‌ర్‌లో ఉండే లాలా భీమ్లా.. అనే బ్యాగ్రౌండ్ సాంగ్ కు సంబంధించిన వీడియో ప్రోమోను దీపావ‌ళి సంద‌ర్భంగా విడుద‌ల చేస్తున్న‌ట్లు పోస్టర్ ద్వారా ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. ప్రోమో కోసం విడుదల చేసిన పోస్టర్ లో మాస్ లుక్ లో పవన్ కళ్యాణ్ ను చూడొచ్చు. "Let's celebrate this diwali with #TheSoundOfBheemla 🥁❤️‍🔥

#LalaBheemla Video Promo out today at 07:02pm" అంటూ చిత్ర యూనిట్ పెద్ద బొట్టుతో లుంగీతో కూర్చుని ఉన్న పవన్ కళ్యాణ్ పోస్టర్ ను విడుదల చేసింది.

ఈ దీపావ‌ళికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చార‌ని పవన్ లుక్ ను చూసి అంటున్నారు. భీమ్లానాయక్ చిత్రం సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


Next Story