మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. అలాంటి ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుండి వచ్చిన పోస్టులను చూసి ఆమె ఫాలోవర్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మంచు లక్ష్మీ అకౌంట్ లో నుండి ట్రేడింగ్ కు సంబంధించిన పోస్టులు వైరల్ అయ్యాయి. ట్రేడింగ్ చేశానని, తనకు లక్షల్లో డబ్బులు వచ్చాయంటూ లక్ష్మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుండి కొన్ని పోస్టులు వచ్చాయి.
ఈ విషయమై మంచు లక్ష్మీ తన ట్విట్టర్ ఖాతాలో స్పందించింది. తన అకౌంట్ హ్యాక్ అయిందంటూ మంచు లక్ష్మీ చెప్పింది. ఇన్‌స్టాగ్రామ్ అఫీషియల్స్ ఈ విషయంలో తనకు హెల్ప్ చేయాలంటూ మంచు లక్ష్మీ కోరింది.
ఇదిలావుంటే.. మంచు లక్ష్మీ కుటుంబంలో విబేధాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ వివాదాలపై మంచు లక్ష్మీ ఎలాంటి కామెంట్లు చేయలేదు. ఇక ఇటీవల 'టీచ్ ఫర్ ఛేంజ్' వార్షిక ఫండ్‌రైజర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూతురితో కలిసి ర్యాంప్ వాక్ చేసింది మంచు లక్ష్మీ. ఆమె స్టేజీపై నిలబడిన సమయంలో మంచు మనోజ్ దంపతులు వెనక నుంచి వచ్చారు. తమ్ముడిని చూడగానే మంచు లక్ష్మికి కన్నీళ్లు ఆగలేదు. మనోజ్ ను పట్టుకుని మనసారా ఏడ్చేసింది. మనోజ్-మౌనిక దంపతులు ఆమెను ఓదార్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.