ఆ వీడియోపై స్పందించిన కేటీఆర్, విజయ్ దేవరకొండ

రష్మిక మందన్నా కు సంబంధించిన ఓ డీప్‌ఫేక్‌ వీడియో వైరల్‌ అయింది. ఓ సోషల్ మీడియా

By Medi Samrat  Published on  8 Nov 2023 3:30 PM GMT
ఆ వీడియోపై స్పందించిన కేటీఆర్, విజయ్ దేవరకొండ

రష్మిక మందన్నా కు సంబంధించిన ఓ డీప్‌ఫేక్‌ వీడియో వైరల్‌ అయింది. ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో ఆ వీడియో బాగా వైరల్‌గా మారింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ స్పందించి మార్ఫింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ వెంటనే పలువురు స్టార్స్, లీడర్స్ కూడా దీనిపై స్పందించారు.

విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ”భవిష్యత్తు కోసం చాలా ముఖ్యమైన అడుగు ఇది. ఇలాంటి ఘటన ఇంకొకరికి జరగకూడదు.. డీప్‌ఫేక్‌ వీడియో చేసే వారి మీద వెంటనే చర్యలు తీసుకునేందుకు ఓ విభాగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.. వెంటనే వారిని శిక్షించాలి.. అప్పుడు మహిళలకు సరైన రక్షణ ఉంటుంది" అని తెలిపాడు.

ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. ఓ జాతీయ ఛానెల్ నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఇది దారుణమైన చర్య అని కేటీఆర్ అన్నారు. రష్మిక డీప్‌ఫేక్ వీడియో గురించి తాను వార్తల్లో చూశానని.. అదో చేదు అనుభవమని తెలిపారు. ఓ సెలబ్రిటీని ఇలా కించపరచడం, అవమానించడం దారుణమన్నారు. ఇలాంటి ఘటనల కట్టడికి చట్టపరంగా చర్యలు తీసుకువస్తే వాటిని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇలాంటి ఘటనలపై కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story