క్రాక్ ట్రైల‌ర్‌.. ర‌వితేజ హిట్టు కొట్టేలా ఉన్నాడుగా..

Krack Movie Trailer. వ‌రుస ప‌రాజ‌యాల‌తో స‌మ‌మ‌తం అవుతున్నాడు మాస్ మ‌హారాజ్ ర‌వితేజ‌ క్రాక్ సినిమా తో హిట్ కొట్టేలాగా ఉన్నాడుగా.

By Medi Samrat  Published on  1 Jan 2021 12:30 PM IST
krack trailer

వ‌రుస ప‌రాజ‌యాల‌తో స‌మ‌మ‌తం అవుతున్నాడు మాస్ మ‌హారాజ్ ర‌వితేజ‌. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాల‌ని మంచి క‌సి మీదున్నాడు. డాన్ శీను, బ‌లుపు వంటి హిట్ చిత్రాల‌ను ఇచ్చిన గోపిచంద్ మ‌లినేనితో జ‌త క‌ట్టాడు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూడో చిత్రం క్రాక్‌. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రవితేజ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నాడు. శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. వరలక్ష్మీ శరత్‌కుమార్ విలన్ పాత్రలో కనిపించనుంది. తమన్ సంగీతం అందించాడు.


తాజాగా కొత్త సంవ‌త్సరం సంద‌ర్భంగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ట్రైలర్ రవితేజ స్టైల్లో ఆకట్టుకునే విధంగా ఉంది. చూశారా జేబులో ఉండాల్సిన నోటు.. చెట్టుకు ఉండాల్సిన కాయ‌.. గోడ‌కు ఉండాల్సిన మేకు.. ఈ మూడు ముగ్గురు తోపెల్ని తొక్కి తాట తీశాయ్‌.. ఇక్క‌డ కామ‌న్ పాయింట్ ఏమిటంటే.. ఈ ముగ్గురితో ఆడుకుంది ఒకే పోలీసోడూ అంటూ విక్ట‌రీ వెంక‌టేష్ వాయిర్ ఓవ‌ర్‌తో ట్రైల‌ర్ ప్రారంభం అవుతుంది. శంక‌ర్ పోత‌రాజు వీర శంక‌ర్‌.. ష్యూర్ షాట్‌.. నో డౌట్‌.. పుచ్చె పేలిపోద్ది అంటూ ర‌వితేజ చెప్పిన డైలాగులు అదుర్స్ అనిపిస్తున్నాయి. ట్రైల‌ర్ చూస్తుంటే.. ఈ చిత్రంలో ర‌వితేజ్ సంక్రాంతికి మంచి హిట్ కొట్టేలా ఉన్నాడు.


Next Story