ప్రభాస్ 25వ సినిమాని డైరెక్ట్ చేస్తున్న కొరటాల శివ.!
Koratala Shiva Directs Prabhas 25th Movie. ప్రభాస్ 25వ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడట.
By Medi Samrat Published on 11 Feb 2021 5:48 PM IST'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా దేశం మొత్తం పాపులర్ అయ్యాడు రెబల్ స్టార్ ప్రభాస్. రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.దేశం మొత్తం ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. ప్రస్తుతం 'రాధేశ్యామ్' సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఆ సినిమా తరువాత 'ఆదిపురుష్', 'సలార్' సినిమాలను చెయ్యబోతున్నాడు. అలానే నాగ్ అశ్విన్ సినిమా కూడా లైన్ లో ఉంది. నాగ్ అశ్విన్ సినిమా ప్రభాస్ కెరీర్ లో 23వ సినిమా. 24వ సినిమాకి కూడా ఇప్పటికే డైరెక్టర్ ఫిక్స్ అయిపోయాడని.. ప్రభాస్ టీమ్ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచిందని సమాచారం అందుతుంది.
దాంతో పాటు ప్రభాస్ 25వ సినిమా కూడా ఓకే అయిపోయిందట. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతుందని సమాచారం. మరో విషయం ఏంటంటే.. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడట..గతంలో ప్రభాస్ నటించిన 'మిర్చి' సినిమాను డైరెక్ట్ చేశాడు కొరటాల శివ. దర్శకుడిగా కొరటాలకి అది తొలి సినిమా అయినప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రభాస్ క్రేజ్ కూడా పెరిగింది.
అందుకే ప్రభాస్ 25వ సినిమా మాత్రం ఖచ్చితంగా కొరటాలతో చేయాలని మైత్రి మూవీ మేకర్స్ నిర్ణయించుకుందట. ప్రభాస్ కూడా తన కెరీర్ లో మైల్ స్టోన్ సినిమా బాధ్యతను కొరటాలకి అప్పగించడానికి సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా పట్టాలెక్కడానికి కనీసం మూడేళ్ల సమయం పడుతుంది. ఇక చూడాలి ఈ సినిమాని కొరటాల శివ ఎలా తెరకేక్కిస్తాడో ఏమో...!!