మా నాన్న డీఎస్పీ అవ‌డంతో ఆయ‌న కారులోనే గంజాయి 3 చెక్ పోస్టులు దాటించాం : కోన వెంకట్‌

Kona Venkat Says He Peddled Drugs for THIS Reason. ప్రముఖ రచయిత కోన వెంకట్‌ అనుకోని వివాదంలో ఇరుక్కున్నారు.

By Medi Samrat  Published on  8 Jan 2023 4:43 PM IST
మా నాన్న డీఎస్పీ అవ‌డంతో ఆయ‌న కారులోనే గంజాయి 3 చెక్ పోస్టులు దాటించాం : కోన వెంకట్‌

ప్రముఖ రచయిత కోన వెంకట్‌ అనుకోని వివాదంలో ఇరుక్కున్నారు. ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్‌ విషయాన్ని వెల్లడించారు. కాలేజీ రోజుల్లో గంజాయి స్మగ్లింగ్‌ చేశానంటూ చెప్పి హాట్ టాపిక్ గా నిలిచారు. ఆర్థిక సమస్యల వల్ల అప్పుల్లో కూరుకుపోయిన తన ఫ్రెండ్‌ కోసం ఈ పని చేశానని తెలిపారు. తన స్నేహితుడు ఒకడు.. ఆర్థిక సమస్యల్లో ఇరుక్కోవడంతో దాన్నుంచి బయటపడేందుకు గంజాయి పండించాడు. ఆ మొత్తాన్ని గోవాకి తరలించి అప్పులన్నీ తీర్చేద్దామనుకున్నాడు. కానీ దారిలో పోలీసులకు దొరికిపోయాడు. ఆ తర్వాత అతడు ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. చావుబతుకుల్లో ఉన్నప్పుడు మాకు విషయం తెలిసి ఎలాగైనా వాడి అప్పులు తీర్చాలని నిర్ణయించుకున్నామని.. మా నాన్న అప్పుడు డీఎస్పీ కావడంతో ఆయన కారులోనే గంజాయి అ‍మ్మేందుకు గోవా వెళ్లామని తెలిపారు. మహబూబ్ న‌గర్, కర్ణాటక, గోవా ఇలా 3 చెక్ పోస్టులు పగడ్బందీగా దాటించి గంజాయి అమ్మి డబ్బులు తీసుకొచ్చామన్నారు. దాంతో నా స్నేహితుడి అప్పులన్నీ తీర్చేశామని తెలిపారు. ఒకవేళ దొరికిపోతే మా పరిస్థితి ఏంటి అని చాలాసార్లు ఆలోచిస్తుంటానని అన్నారు. అంతేకాకుండా.. మా రియల్‌ లైఫ్‌లో జరిగిన ఈ స్టోరీనే సినిమాగా తీయాలని అనుకుంటున్నానని చెప్పి అనుకోని వివాదంలో ఇరుక్కుపోయారు రచయిత కోన వెంకట్‌.


Next Story