'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్‌ పాత్ర.. కొమురం భీం మునిమనవడు ఏమన్నాడంటే.!

Komuram Bhim's grandson's reaction on NTR's role in 'RRR'. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కలిసి నటించిన సినిమా 'ఆర్ఆర్‌ఆర్‌'. ఈ సినిమాకు జక్కన్క రాజమౌళి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో జూనియర్‌ ఎన్టీఆర్‌..

By అంజి  Published on  11 Dec 2021 8:23 AM GMT
ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్‌ పాత్ర.. కొమురం భీం మునిమనవడు ఏమన్నాడంటే.!

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కలిసి నటించిన సినిమా 'ఆర్ఆర్‌ఆర్‌'. ఈ సినిమాకు జక్కన్క రాజమౌళి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో జూనియర్‌ ఎన్టీఆర్‌.. కొమురంభీం పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రని పరిచయం చేస్తూ.. చిత్ర బృందం విడుదల చేసిన వీడియోపై అప్పట్లో అభ్యంతరాలు వచ్చాయి. ఎన్టీఆర్‌ కనబడిన తీరుపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంపై రాజమౌళి స్పందించారు. ఆదివాసీ ముద్దు బిడ్డడ కొమురంభీం పాత్రను అద్భుతంగా చూపిస్తానని చెప్పారు. 'ఆర్ఆర్‌ఆర్‌' సినిమా విషయంలో కొమురం భీం వారసులు సానుకూలంగానే ఉన్నారు. 'ఆర్ఆర్‌ఆర్‌' సినిమా విడుదల కోసం ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా 'ఆర్ఆర్‌ఆర్‌' సినిమాపై కొమురంభీం మునిమనవడు కొమురం సోనే రావ్‌ మాట్లాడారు.

కొమురంభీం పోరాటాన్ని సినిమా రూపంలో తెరకెక్కించడం సంతోషంగా ఉందన్నారు. కొమురం భీం చరిత్రను దర్శకుడు రాజమౌళి ప్రపంచానికి తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళికి సోనేరావు ధన్యవాదాలు తెలిపారు. అయితే కొన్ని నెలల కిందట 'ఆర్ఆర్‌ఆర్‌' సినిమాలో ఎన్టీఆర్‌ కనిపించిన తీరుపై కొమురం సోనేరావు సీరియస్‌ అయిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచవ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. డిసెంబ‌ర్ 9న‌ ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌గా.. విశేష స్పంద‌న వ‌స్తోంది.

Next Story
Share it