'క' సినిమా విషయంలో క్రేజీ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన 'క' సినిమా ఈ దీపావళికి విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమాకు స్క్రీన్స్ కూడా భారీగా పెరుగుతున్నాయి.

By Medi Samrat  Published on  2 Nov 2024 7:21 PM IST
క సినిమా విషయంలో క్రేజీ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన 'క' సినిమా ఈ దీపావళికి విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమాకు స్క్రీన్స్ కూడా భారీగా పెరుగుతున్నాయి. క సినిమా విషయంలో కిరణ్ అబ్బవరం క్రేజీ న్యూస్ పంచుకున్నారు.

కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. గతంలో పక్కింటి కుర్రాడి ఇమేజ్ తో ప్రేక్షకులు చూశారని, ఇప్పుడు మన ఇంటి అబ్బాయి అని అంటున్నారు. సినిమా టికెట్స్‌ కావాలని, దొరకటం లేదని, థియేటర్స్‌ పెంచాలని అడుగుతుంటే ఆనందంగా వుందన్నారు. ఈ నెల 8వ తేదీన మలయాళంలో కూడా 'క' సినిమాను విడుదల చేస్తున్నామని తెలిపారు. 'క' సినిమాకు సీక్వెల్ చేస్తామని కిరణ్ అబ్బవరం ప్రకటించారు.

'క' సినిమా దర్శక ద్వయం సుజీత్, సందీప్‌ నేతృత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రాన్ని చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మించారు. నయన్‌ సారిక, తన్వీరామ్‌ హీరోయిన్లు. వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు.

Next Story