కిరణ్ అబ్బవరం సినిమాకు భారీ బిజినెస్

కిరణ్ అబ్బవరం తన కొత్త ప్రాజెక్ట్ 'క' తో పాన్-ఇండియా క్లబ్‌లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాడు.

By Medi Samrat  Published on  25 July 2024 9:30 PM IST
కిరణ్ అబ్బవరం సినిమాకు భారీ బిజినెస్

కిరణ్ అబ్బవరం తన కొత్త ప్రాజెక్ట్ 'క' తో పాన్-ఇండియా క్లబ్‌లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇటీవల విడుదలైన టీజర్‌కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించడంతో ఈ చిత్రం మీద మంచి హైప్ నెలకొంది. ఈ సినిమా పలు భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులు 12 కోట్లకు అమ్ముడవుతుండగా, అన్ని భాషల థియేట్రికల్, నాన్-థియేట్రికల్ రైట్స్ మేకర్స్ 30 కోట్ల బిజినెస్‌ను సంపాదించినట్లు సమాచారం. ఇది యంగ్ హీరో సినిమాకు మంచి బిజినెస్ కిందకే వస్తుంది.

నూతన దర్శకులు సుజిత్, సందీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మించారు. ప్రస్తుతం చిత్ర నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. రాజా వారు రాణి గారు సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం తెలుగులో తనదైన ముద్ర వేశాడు. చిన్న విరామం తీసుకుని ఇప్పుడు 'క' సినిమాతో తిరిగి వస్తున్నాడు. ఈ సినిమా కిరణ్ అబ్బవరం కెరీర్ ను నిలబెడుతుందని ఎంతో నమ్మకంతో ఉంది చిత్ర యూనిట్.

Next Story