విజ‌య్ దేవ‌ర‌కొండ ‘కింగ్‌డ‌మ్’ టికెట్ ధ‌ర‌ల పెంపున‌కు ఏపీ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్

డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కింగ్‌డమ్ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్నారు.

By Medi Samrat
Published on : 24 July 2025 5:00 PM IST

విజ‌య్ దేవ‌ర‌కొండ ‘కింగ్‌డ‌మ్’ టికెట్ ధ‌ర‌ల పెంపున‌కు ఏపీ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్

డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కింగ్‌డమ్ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూలై 31న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'కింగ్‌డమ్' చిత్రానికి ప్రత్యేక టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా విడుదలైన మొదటి 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకోవచ్చని అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.75 వరకూ పెంచుకునే అవకాశం కల్పించారు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాకు టికెట్ల ధరలు పెంచుకోవచ్చంటూ అనుమతులు ఇచ్చారు. ఇప్పటికే సినిమా హాళ్లకు జనం రాకపోగా, ఇప్పుడు పెంచుతున్న టికెట్ల ధరలు థియేటర్లకు జనాన్ని మరింత దూరం చేస్తున్నాయి.

Next Story