కేజీఎఫ్-2 : విడుదల తేదీ ప్రకటించేది నేడే.. సాయంత్రం 6:32 గంటలకు ముహుర్తం..!
KGF-2 Movie Release Date Announcement Today. 'కేజీఎఫ్-2' సినిమా విడుదల తేదీ ప్రకటించేది నేడే.
By Medi Samrat Published on 29 Jan 2021 10:44 AM IST'కేజీఎఫ్-2' సినిమా టీజర్ విడుదలై రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి పార్టుగా వచ్చిన కేజీఎఫ్.. అద్యంతం యాక్షన్ థ్రిల్లర్ గా అలరించింది. దీంతో కేజీఎఫ్-2 సినిమాపై అంచనాలు మాములుగా లేవు. దీంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎంతో శ్రద్దతో రెండో భాగాన్ని తెరకెక్కిస్తున్నాడు. మొదటి పార్టు అభిమానులకు పూనకాలు తెప్పించగా.. తాజాగా రెండో టీజర్ విడుదలై అరుపులు పెట్టిస్తుంది. టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది. సినిమా ఉప్పుడు విడుదలవుతుందా..? అనే ఆసక్తిని పెంచింది.
అయితే.. తాజాగా చిత్రబృందం కేజీఎఫ్-2 చిత్ర విడుదలపై ఓ అప్‌డేట్ ఇచ్చింది. ఈ రోజు సాయంత్రం 6:32 గంటలకు సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశారు.
That promise will be fulfilled.#KGFChapter2 release date announcement today at 6:32pm.@TheNameIsYash @prashanth_neel @VKiragandur@hombalefilms @duttsanjay @TandonRaveena@SrinidhiShetty7 @prakashraaj @BasrurRavi @bhuvangowda84 @excelmovies @VaaraahiCC @PrithvirajProd pic.twitter.com/TCKD5UXq54
— Prashanth Neel (@prashanth_neel) January 29, 2021
ఇక బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ ఈ సినిమాలో విలన్ అధీరగా ప్రేక్షకుల ముంగిట్లోకి వస్తున్నారు. తొలి కేజీఎఫ్ సినిమాలో అధీరాను చూపకపోవడం గమనార్హం. కేవలం సింహపు ఉంగరం ధరించిన వ్యక్తిని.. ఆయన ముఖం కనిపించకుండా చూపారు. దీంతో ఆ పాత్ర ఎవరు చేస్తారన్న విషయమై సినీ ప్రేమికుల్లో ఆసక్తి నెలకొంది. అధీర పాత్రను సంజయ్‌దత్ చేస్తారని ప్రకటించగానే మరింత ఆసక్తి పెరిగింది.
అంతేకాకుండా ఇంకా ఈ సినిమాలో రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ తదితరులు నటిస్తుండటంతో చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. కేజీఎఫ్ పార్టు-1లోని పలు ప్రశ్నలకు లభించని సమాధానాలు.. రెండో భాగంలో లభిస్తాయని భావిస్తున్నారు. కరోనా కారణంగా థియేటర్లలో సందడి దూరమైన వేళ.. ఈ సినిమా త్వరలోనే విడుదలై థియేటర్లకు పాత కళను తీసుకొస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.