సినిమా టికెట్‌ ధరలకు సంబంధించి.. శుభం కార్డు పడినట్లే: చిరంజీవి

Key meeting of cine celebrities with AP CM YS Jagan. సినిమా టికెట్‌ ధరలకు సంబంధించి శుభం కార్డు పడినట్లేనని తాము భావిస్తున్నామని, సీఎం జగన్‌తో భేటీ తమను ఎంతో సంతోష

By అంజి  Published on  10 Feb 2022 3:26 PM IST
సినిమా టికెట్‌ ధరలకు సంబంధించి.. శుభం కార్డు పడినట్లే: చిరంజీవి

సినిమా టికెట్‌ ధరలకు సంబంధించి శుభం కార్డు పడినట్లేనని తాము భావిస్తున్నామని, సీఎం జగన్‌తో భేటీ తమను ఎంతో సంతోష పరిచిందని చిరంజీవి అన్నారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో భేటీ అయిన తర్వాత సినీ ప్రముఖులు మీడియాతో మాట్లాడారు. చిన్న సినిమాలను కూడా ఐదో షోకు అనుమతించడం మంచి విషయమన్నారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం జగన్‌ సానుకూలంగా స్పందించారని, గతంలో తాను చర్చించిన అంశాల సారాంశాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్‌ మాట్లాడరని చిరంజీవి చెప్పారు. సినీ ఇండస్ట్రీ బాగుండాలంటే చిన్న సినిమాల దర్శకుడు, నిర్మాతలు బాగుండాలని.. ఈ నేపథ్యంలోనే మేము ఐదో షోకు అనుమతి కోరగా, సీఎం ఆమోదం తెలిపారని అన్నారు. ఇక భారీ బడ్జెట్‌ చిత్రాలకు ప్రత్యేక వెసులుబాటుపై కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని సీఎం జగన్‌ చెప్పారన్నారు. చర్చల విషయంలో తమకు మద్దతుగా నిలిచిన మంత్రి పేర్ని నానికి ధన్యవాదాలు తెలిపారు. ఫిబ్రవరి నెల ముగిసే లోపు సినీ పరిశ్రమకు సంబంధించిన జీవో వచ్చే అవకాశం ఉందని చిరంజీవి అన్నారు.

సినీ నటుడు మహేష్‌ బాబు మాట్లాడుతూ.. సనీ పరిశ్రమ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చిరంజీవి చేస్తున్న కృషికి ధన్యవాదలు తెలిపారు. గడిచిన 6 నెలల నుండి తెలుగు ఇండస్ట్రీ అయోమయంలో ఉందని, నేటితో పెద్ద రిలీఫ్‌ వచ్చిందన్నారు. 10 రోజుల్లో మంచి వార్త వింటామని మహేష్‌ బాబు పేర్కొన్నారు. అలాగే ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విషయాలపై సీఎం జగన్‌ చొరవ చూపడం ఆనందం కలిగించిందన్నారు. తమ ప్రతిపాదనలన్నీ విని మంచి నిర్ణయాన్ని తీసుకున్నారని అన్నారు. ప్రముఖ నటుడు ఆర్‌.నారాయణ మూర్తి మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో సినిమా మనుగడ కష్టంగా మారిందని, పెద్ద సినిమాలు విడుదల అయినప్పుడు చిన్న సినిమాల విడుదలకు థియేటర్ల దొరకడం లేదు, అయితే సగటు చిన్న చిత్రాలను కాపాడాలని సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయం ఎంతో ఆనందం కలిగించిందన్నారు.

Next Story