'గుడ్ లక్ సఖి' కి బాక్సాఫీసు దగ్గర లక్ కలిసొస్తుందా..?
Keerthy Suresh shows the inspiring journey of a shooter in the sports film. కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రలో నటిస్తున్న సినిమా 'గుడ్ లక్ సఖి'.. సుధీర్ చంద్ర నిర్మించిన
By Medi Samrat Published on 24 Jan 2022 11:41 AM IST
కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రలో నటిస్తున్న సినిమా 'గుడ్ లక్ సఖి'.. సుధీర్ చంద్ర నిర్మించిన ఈ సినిమాకి నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించాడు. కీర్తి సురేశ్ గిరిజన యువతిగా కనిపించనుంది. ఆమెకు ఎంతో బ్యాడ్ లక్ ఉందని ఇప్పటికే సినిమా నుండి విడుదలైన ఓ పాట ద్వారా చెప్పారు. ఆ ఊరి జనాలు ఆమె గురించి ఎన్నో చెబుతూ ఉంటారు. అలాంటిది ఆమె రైఫిల్ షూటర్ గా విజయాన్ని అందుకుందా అన్నదే సినిమా కథ. కీర్తి సురేశ్ కు జోడీగా ఆది పినిశెట్టి నటించగా, కీలకమైన పాత్రలో జగపతిబాబు కనిపించనున్నాడు. ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అందులో సినిమాకు సంబంధించిన కీలక కథను ప్రేక్షకులకు తెలియజేశారు.
కీర్తి సురేష్ నటించిన గుడ్ లక్ సఖి చిత్రం జనవరి 28న విడుదలకు సిద్ధమవుతోంది. ట్రైలర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసారు. షూటర్‌గా కీర్తి సురేష్ స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని ఇందులో సూచించారు. పల్లెటూరి అమ్మాయి నుండి, కోచ్ పాత్రలో నటించిన జగపతి బాబు సహాయంతో ఆమె దేశానికి షూటర్‌గా ఎదిగింది. ఈ సినిమాలో ఆది పినిశెట్టితో రొమాన్స్‌ను కూడా చూపిస్తుంది. ట్విట్టర్‌లో ట్రైలర్‌ను షేర్ చేస్తూ, కీర్తి సురేష్ "మనకీ ఏది అలవాటు? గెలుపు! Here's the entertaining trailer of #GoodLuckSakhi 😊❤️" అంటూ చెప్పుకొచ్చింది.
వర్త్ ఎ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్ చంద్ర పదిరి, శ్రావ్య వర్మ నిర్మించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిరంతన్ దాస్ సినిమాటోగ్రాఫర్ కాగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా ఉన్నాడు. అంతకు ముందు ఈ చిత్రాన్ని డిసెంబర్ 31, 2021న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ కోవిడ్ సమస్యలు, ఇతర పెద్ద చిత్రాలతో పోటీ కారణంగా, చిత్ర నిర్మాతలు సినిమా విడుదలను వాయిదా వేశారు.