మార్ఫింగ్ ఫొటోలతో ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా నటీనటులు కూడా..! కొద్దిరోజుల కిందట నటి కీర్తి సురేష్ కు సంబంధించిన మార్ఫింగ్ ఫోటోలు కూడా ఇదే తరహాలో వైరల్ అయ్యాయి. అలాంటి ఫోటోలపై కీర్తి సురేష్ స్పందించారు. నకిలీ ఫోటోలు తనను మానసికంగా తీవ్రంగా బాధించాయని, టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. తన పేరుతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కొన్ని బోల్డ్ ఫొటోలు చూసి తానే షాక్ అయ్యానని, అవి తాను దిగిన ఫోటోలు కాదని, పూర్తిగా AI ద్వారా రూపొందించిన నకిలీ చిత్రాలని తెలిపింది. వాటిని చూసినప్పుడు నిజంగానే నేను ఇలా ఫోజులిచ్చానా అని నేను నన్నే ప్రశ్నించుకున్నా అని తెలిపింది. సోషల్ మీడియాలో ఉన్న ఏ వ్యక్తికైనా ఏఐ ద్వారా ముప్పు పొంచి ఉందని కీర్తి తెలిపింది.