దండుపాళ్యం గెటప్‌లో కీర్తిసురేష్.. ఫోటో వైరల్
Keerthi Suresh In Dandupalyam Look. నేను శైలజ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ కీర్తిసురేష్. మహానటి
By Medi Samrat Published on 16 Nov 2020 9:57 AM ISTనేను శైలజ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ కీర్తిసురేష్. మహానటి చిత్రంతో జాతీయ స్థాయిలో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఆ చిత్రం తరువాత మహిళా ప్రాధాన్యమున్న చిత్రాల్లోనే ఎక్కువగా నటిస్తోంది అమ్మడు. ఇటీవల కీర్తి నటించిన రెండు చిత్రాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. 'పెంగ్విన్' ప్లాప్ నుంచి తేరుకోకముందే.. కీర్తి నటించిన 'మిస్ ఇండియా' చిత్రానికి కూడా నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. తాజాగా కీర్తి సురేష్ ఉన్నట్లుండి కొత్త లుక్ లో కనిపించింది. దండుపాళ్యం సినిమాలోని నేరస్తుల వలె కూర్చున్న 'సాని కాయిదం' సినిమా పోస్టర్ ను షేర్ చేసింది కీర్తి సురేష్.
సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా దర్శకత్వం అందిస్తున్నాడు. సెల్వ రాఘవన్ కూడా ఈ పోస్టర్ లో ఉండటంతో తమిళ ప్రేక్షకులతో పాటు అంతా కూడా వావ్ అంటున్నారు. తలకు గాయాలతో కీర్తి సురేష్ డీ గ్లామర్ గా చీర కట్టులో కాళ్లపై కూర్చుని ముందు ఆయుదాలు ఉండటంతో ఇదేదో క్రైమ్ డ్రామా మూవీ అయ్యి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. ఫస్ట్ లుక్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
ప్రస్తుతం కీర్తి.. 'సర్కారు వారి పాట'లో మహేష్ బాబు సరసన నటిస్తోంది. ఇప్పుడు దండుపాళ్యం తరహా పాత్రలో ఉన్న 'సాని కాయిదం' సినిమాలో కనిపిస్తుండడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.