టాలీవుడ్‌లో విషాదం.. యువ న‌టుడు హ‌ఠాన్మ‌ర‌ణం

Keeda Cola Actor Harikanth Passed Away. షూటింగ్ ద‌శ‌లో ఉన్న‌ ‘కీడా కోలా’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోన్న యువ నటుడు హరికాంత్ శనివారం

By Medi Samrat  Published on  1 July 2023 2:58 PM IST
టాలీవుడ్‌లో విషాదం.. యువ న‌టుడు హ‌ఠాన్మ‌ర‌ణం

షూటింగ్ ద‌శ‌లో ఉన్న‌ ‘కీడా కోలా’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోన్న యువ నటుడు హరికాంత్ శనివారం గుండెపోటుతో హఠాత్తుగా కన్నుమూశారు. పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాలను తెర‌కెక్కించిన‌ తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో ‘కీడా కోలా’ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాలో హరికాంత్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఆయన‌ వయసు 33 సంవత్సరాలు. గుండెపోటుతో హరికాంత్ ఇంట్లోనే తుది శ్వాస విడిచిన‌ట్లు తెలుస్తోంది. యువ న‌టుడి మ‌ర‌ణంతో టాలీవుడ్‌లో విషాదం నెల‌కొంది.

థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన‌ హరికాంత్.. సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటిస్తూ గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఆయ‌న తాజాగా న‌టించిన ‘కీడా కోలా’ సినిమా రిలీజ్‌కి సిద్ధ‌మ‌వుతుండగానే హ‌రికాంత్ క‌న్నుమూయ‌టం ఎంతో బాధాక‌రం. రెండు రోజుల ముందే ఈ సినిమా టీజర్‌ని చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. హరికాంత్ మ‌ర‌ణవార్త‌ను ప్ర‌ముఖ మూవీ పీఆర్ క‌న్స‌ల్‌టెంట్ వంశీ కాక ట్విట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. యువ‌నటుడి హ‌ఠాన్మ‌ర‌ణం ప‌ట్ల తెలుగు చిత్ర‌సీమకు చెందిన ప‌లువురు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు.




Next Story