కార్తికేయ-2 మరోసారి వాయిదా..!

Karthikeya-2 postponed once again. చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా కార్తికేయ 2.

By Medi Samrat  Published on  3 Aug 2022 8:30 PM IST
కార్తికేయ-2 మరోసారి వాయిదా..!

చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా కార్తికేయ 2. ఇది సూపర్ హిట్ సినిమా కార్తికేయకు సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్, విశ్వప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఆగస్టు 12వ తేదీన థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయనున్నట్టు మేక‌ర్స్ ప్రకటించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేస్తూ మ‌రో డేట్ ను ప్ర‌క‌టించారు మేక‌ర్స్. ఆగస్టు 13వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్న‌ట్టు చిత్ర బృందం తెలిపింది.

ఆగస్ట్ 13కు పోస్ట్‌పోన్ అయినట్టు మూవీ టీమ్ ప్రెస్ మీట్‌లో ప్రకటించింది. ఎందుకు ఇన్నిసార్లు ఈ సినిమా పోస్ట్‌పోన్ అవుతుంది అని ప్రశ్నకు.. ప్రతీసారి మమ్మల్నే తగ్గమంటున్నారు అంటూ నిఖిల్ సమాధానం ఇచ్చాడు. కార్తికేయ‌ 2 సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ యూఏ స‌ర్టిఫికెట్ జారీ చేసింది. కార్తికేయ 2లో శ్రీనివాస్ రెడ్డి, బాలీవుడ్ యాక్ట‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్‌ అనుపమ్‌ఖేర్, ఆదిత్యా మీన‌న్‌, హ‌ర్ష చెముడు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కార్తికేయ 2కు కాలభైరవ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Next Story