పాత తరం సినిమాల్లో ఎన్నో జానపద చిత్రాల్లో నటించారు కాంతారావు. రామారావు తర్వాత ఆ స్థాయిలో జానపద చిత్రాల్లో నటించిందిన ఘనత ఆయనకే దక్కుతుంది. టాలీవుడ్ లో ఆయన్ని కత్తి కాంతారావు అంటారు. తెలుగు సినిమా రంగంలో ప్రముఖ నటుడిగా వెలుగొందిన కాంతారావు దాదాపు 400 చిత్రాలలో నటించారు. అయితే చివరి దశలో అనారోగ్యం పాలై 2009లో కన్నుమూశారు.
2009 మార్చి 22న ఆయన మరణించగా, ఈ రోజు మధ్యాహ్నాం 12 గంటల సమయంలో కాంతారావు సతీమణి హైమావతి(87) గుండెపోటుతో మరణించారు. మల్లాపూర్‌లో ఉన్న వారి నివాసంలోనే ఆమె స్వర్గస్తులయ్యారు. గత కొంత కాలంగా ఆమె ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు టాలీవుడ్ లో న్యూస్ చక్కర్లు కొట్టింది.
ఈ విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని శ్రీమతి హైమావతికి అందించే ఏర్పాటు చేసింది. కాంతారావు, హైమావతి దంపతులకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె. అయితే... కాంతారావుకు 1940లో సుశీలతో వివాహం జరిగింది. హైమావతి మృతికి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.