స్టార్‌ హీరో పునీత్‌ కుమార్‌కు గుండెపోటు.. హుటాహుటిన ఆస్పత్రికి సీఎం.!

Kannada hero puneeth rajkumar hospitalized due to heart attack. ప్రముఖ కన్నడ హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌ గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ని బెంగళూరులోని విక్రమ్‌ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.

By అంజి  Published on  29 Oct 2021 8:05 AM GMT
స్టార్‌ హీరో పునీత్‌ కుమార్‌కు గుండెపోటు.. హుటాహుటిన ఆస్పత్రికి సీఎం.!

ప్రముఖ కన్నడ హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌ గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ని బెంగళూరులోని విక్రమ్‌ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. శుక్రవారం ఉదయం సమయంలో ఇంట్లో జిమ్‌ చేస్తుండగా రాజ్‌కుమార్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండె పోటు రావడంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయారు. దీంతో పునీత్‌ను వారి కుటుంబ సభ్యులు దగ్గర్లోని విక్రమ్‌ ఆస్పత్రి తరలించారు. వైద్యులు పునీత్‌కు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఆయనకు వైద్యులు ఈసీజీ పరీక్షలు నిర్వహించారు.

విషయం తెలుసుకున్న కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై వెంటనే ఆస్పత్రికి వెళ్లారు. పునీత్‌ ఆరోగ్యం గురించి వైద్యులతో ఆరా తీశారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ ఆస్పత్రిలో చేరడంతో ఆయన ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పునీత్‌ ఆరోగ్య పరిస్థితిపై ప్రముఖులు స్పందిస్తున్నారు. 46 ఏళ్ల వయస్సున్న పునీత్‌.. కన్నడ కంఠీర రాజ్‌ కుమార్‌ మూడో కుమారుడు. పునీత్‌ 'యువరత్న' మూవీతో తెలుగును ప్రేక్షకులను కూడా అలరించాడు.


Next Story
Share it