చిత్ర పరిశ్రమల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. కన్నడ సినిమారంగానికి చెందిన క్యారెక్టర్ నటి బి. జయ కన్నుమూశారు. ఆమె వయసు 75 సంవత్సరాలు. 350కిపైగా సినిమాలలో ఆమె నటించారు. మూడు దశాబ్దాలకుపైగా ఆమె హాస్య, క్యారక్టెర్ పాత్రల్లో నటించారు. అంతేకాక బుల్లి తెరపై పలు ధారావాహికలలో నటించారు. ఇటీవలి కాలంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె గురువారం కన్నుమూశారు. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
జయమ్మ 1945లో కొల్లెగల్ లో జన్మించారు. భక్త ప్రహ్లాద చిత్రంతో 1958లో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. టీఎన్ నరసింహ రాజు, ద్వారకీష్, డాక్టర్ రాజ్ కుమార్, కల్యాన్ కుమార్, ఉదయ్ కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్ వంటి ప్రముఖలతో కలిసి సినిమాల్లో నటించారు. చివరగా ఆమె 2018లో అమ్మ ఐ లవ్ యూ చిత్రంలో నటించారు. 2004-05లో గౌడ్రూ మూవీలో నటనకు గాను జయమ్మ ఉత్తమ సహాయక నటి అవార్డు గెల్చుకున్నారు. ఆమె మృతి అభిమానులని ఎంతగానో కలవరపరుస్తోంది. ఆమె మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.