రోడ్డు ప్రమాదం.. ఐసీయూలో నటుడు విజయ్

Kannada actor Sanchari Vijay suffers serious injuries in road accident. కన్నడ నటుడు సంచరి విజయ్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.

By Medi Samrat
Published on : 13 Jun 2021 7:25 PM IST

రోడ్డు ప్రమాదం.. ఐసీయూలో నటుడు విజయ్

కన్నడ నటుడు సంచరి విజయ్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) లో ఉన్నారు. జూన్ 12, శనివారం బైక్ పై తన స్నేహితుడి దగ్గర నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఈ ప్రమాదానికి గురయ్యారు. విజయ్ కు ఇంకా స్పృహ రాలేదని తెలుస్తోంది. న్యూరో సర్జన్ అరుణ్ నాయక్ మీడియా తో మాట్లాడుతూ విజయ్ పరిస్థితి క్రిటికల్ గా ఉందని అన్నారు. అతనికి మెదడులో రక్తం గడ్డకట్టిందని.. శస్త్రచికిత్స చేశామని తెలిపారు. రాబోయే 48 గంటలు గడిస్తే కానీ చెప్పలేమని అని డాక్టర్లు చెప్పారు.

ప్రమాదానికి గురైన వెంటనే విజయ్‌ను ఆసుపత్రికి తరలించారు. విజయ్ మెదడు యొక్క కుడి భాగంలో మరియు తొడ ప్రాంతంలో గాయాలైనట్లు సమాచారం. 2011 లో 'రంగప్ప హోగ్బిటనా' అనే సినిమా ద్వారా అరంగేట్రం చేసాడు. దాసవాలా, హరివు, ఒగ్గారనే, కిల్లింగ్ వీరప్పన్, వర్తమాన, సిపాయ్ లాంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించారు. 'నాను అవనాల్లా అవలు' చిత్రంతో జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. విజయ్ త్వరగా కోలుకోవాలని ప్రముఖులు, అభిమానులు ఆశిస్తూ ఉన్నారు.


Next Story