8వ రోజు.. 20 టిక్కెట్లు.. రూ. 4,420 వ‌సూలు.. ఫైర్‌బ్రాండ్ న‌టి సినిమా ప‌రిస్థితి ఇది..!

Kangana Ranaut’s ‘Dhaakad’ collects Rs 4420 on day 8. కంగనా రనౌత్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఫైర్‌బ్రాండ్ ఇమేజ్‌ను

By Medi Samrat  Published on  28 May 2022 8:14 AM GMT
8వ రోజు.. 20 టిక్కెట్లు.. రూ. 4,420 వ‌సూలు.. ఫైర్‌బ్రాండ్ న‌టి సినిమా ప‌రిస్థితి ఇది..!

కంగనా రనౌత్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఫైర్‌బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న న‌టి. అయితే ఆమె ఇటీవ‌ల‌ నటించిన యాక్షన్ చిత్రం 'ధాకడ్' బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం మూట‌గ‌ట్టుకుంది. ఈ చిత్రం విడుదలై ఎనిమిదో రోజులు కాగా.. ఎనిమిదో రోజు కేవలం రూ. 4,420 మాత్రమే వసూలు చేసింది. దేశవ్యాప్తంగా కేవలం మాత్రమే అమ్ముడయ్యాయి. ఓపెనింగ్ రోజు రూ. 50 లక్షలు వ‌సూలు చేసిన ఈ చిత్రం ఓవ‌రాల్‌గా దాదాపు రూ. 3 కోట్లను రాబట్టగలిగింది. 80 నుంచి 90 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.

బాక్స్ ఆఫీస్ ఇండియా ట్విట్టర్ హ్యాండిల్ ఈ డిటేయిల్స్‌ను షేర్ చేసింది, "#Dhaakad ఈరోజు భారతదేశం అంతటా 20 టిక్కెట్లను విక్రయించడం ద్వారా 4 వేలు వసూలు చేసింది." మే 20న విడుదలైంది, వీకెండ్ రన్ చాలా పేలవంగా ఉంది, చాలా థియేటర్లలో ఈ చిత్రాన్ని సోమవారం నాటికే నిలిపివేశారని పేర్కొంది.

రజ్నీష్ ఘై దర్శకత్వం వహించిన 'ధాకడ్‌'లో అర్జున్ రాంపాల్, దివ్యా దత్తా, శాశ్వత ఛటర్జీ త‌దిత‌రులు నటించారు. భారీ నష్టం చ‌విచూసిన నేఫ‌థ్యంలో ఓటీటీ ప్లాట్ ఫాంపై స్ట్రీమ్ అవ‌డం కోసం స‌రియైన వేదికకై ఈ చిత్ర యూనిట్‌ కష్టపడుతోన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

Next Story
Share it