ఓటీటీలో విడుదలకు సిద్ధమైన భారతీయుడు 2

భారతీయుడు 2.. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది.

By Medi Samrat  Published on  8 Aug 2024 8:09 PM IST
ఓటీటీలో విడుదలకు సిద్ధమైన భారతీయుడు 2

భారతీయుడు 2.. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ సమయంలో ప్రతికూల స్పందనను అందుకుంది. నష్టాలను పూడ్చుకోవడానికి టీమ్ ముందస్తుగా OTT లో విడుదల చేయాలని నిర్ణయించుకుంది. భారతీయ 2 ఆగస్టు 9న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది.

భారతీయుడు షూట్ దశ నుంచి సినిమాకు ఏదీ కలిసి రాలేదు. ప్రొడక్షన్ స్టేజ్‌లో దర్శకుడు శంకర్ అనివార్య కారణాల వల్ల ప్రాజెక్ట్ నుండి దూరం అయ్యాడు. ఆ తర్వాత సినిమా రెండు భాగాలుగా తయారైంది. అది కాస్ట్లీ మిస్టేక్ అని తేలింది. ఇండియన్ 2 పేలవమైన పనితీరుతో ఇప్పుడు ఇండియన్ 3 మీద కూడా నీలి నీడలు పడ్డాయి. భారతీయుడు 2 చిత్రం డిజిటల్ హక్కులు ప్రముఖ OTT జెయింట్, నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఆగస్టు 9న ప్రసారం చేయనున్నారు. OTT స్పేస్‌లో సినిమాకు ఎలాంటి పేరు వస్తుందో చూద్దాం.

Next Story