సర్జరీ సక్సెస్.. మీరు కురిపించే ప్రేమే నాకు మెడిసిన్ అంటున్న కమల్

Kamal Haasan posts first message post surgery. విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ కుడి కాలి ఎముకకు ఇన్‌ఫెక్షన్‌ కావడంతో మంగళవారం రాత్రి సర్జరీ చేయించుకున్నారు ఆది సక్సెస్ అయింది.

By Medi Samrat
Published on : 20 Jan 2021 4:12 PM IST

Kamal Hassan surgery success

విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ కుడి కాలి ఎముకకు ఇన్‌ఫెక్షన్‌ కావడంతో మంగళవారం రాత్రి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. ఈ సర్జరీ విజయవంతం అయ్యిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తనకు సర్జరీ చేసిన వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు కమల్ హాసన్. 'సర్జరీ విజయవంతమైంది. శ్రీ రామచంద్ర ఆస్పత్రిలోని వైద్యబృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను కోలుకున్న వెంటనే నా అభిమానులతో మాట్లాడాలని తహతహలాడాను. ఎందుకంటే మీరు కురిపించే ప్రేమే నాకు మెడిసిన్‌. త్వరలోనే కలుద్దాం' అని అన్నారు. కమల్ కుమార్తెలు కూడా రజనీకాంత్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. తమ తండ్రి..విశ్వ నటుడు కమల్‌ హాసన్‌ కాలికి శస్త్ర చికిత్స జరిగిందని శృతిహాసన్, అక్షర హాసన్‌ తెలిపారు. నాలుగైదు రోజులు హాస్పిటల్‌లోనే కమల్‌ ఉంటారని, తర్వాతే డాక్టర్స్‌ ఆయన్ని డిశ్చార్స్‌ చేస్తారని తెలిపారు. కమల్‌ కాలి ఆపరేషన్‌ను చెన్నైలోని రామచంద్ర హాస్పిటల్‌లో నిర్వహించారని, కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని, తర్వాత ఆయన మళ్లీ ప్రజలను ఎప్పటిలాగే కలుసుకుంటారని అన్నారు.

2016లో కమల్ హాసన్ ఓ ప్రమాదానికి గురవడంతో కాలుకు సర్జరీ చేశారు. ఇటీవల ఆ కాలు ఇన్‌ఫెక్షన్‌కు గురి కావడంతో చెన్నైలోని రామచంద్ర ఆస్పత్రిలో చేరారు. అక్కడి వైద్యులు జనవరి 19న మరోసారి శస్త్రచికిత్స జరిపారు. ఈ సర్జరీ విజయవంతంగా పూర్తి అయిందని తెలుస్తోంది.

ప్రస్తుతం కమల్‌ విక్రమ్‌, భారతీయుడు 2 సినిమాల్లో నటిస్తున్నారు. కమల్ హాసన్ ఇటీవల ప్రకటించిన కొత్త చిత్రం `విక్రమ్` షూటింగ్ మొదలుపెట్టాల్సి ఉండగా శస్త్ర చికిత్స జరిగింది. చిన్నపాటి గ్యాప్ తీసుకుని వెంటనే ప్రారంభిస్తారని తెలుస్తోంది. లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కమల్ హాసన్ రాజకీయ పార్టీ `మక్కల్ నీది మయం` మేలో జరగనున్న తమిళనాడు సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దిగనుంది.




Next Story