కల్కి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా?

ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 AD సినిమాకు భారీ హైప్ నెలకొంది. ఈ సినిమాకు ఓవర్సీస్ ప్రీమియర్లలో రికార్డ్ బిజినెస్ జరుగుతోంది.

By Medi Samrat  Published on  21 Jun 2024 6:23 PM IST
కల్కి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా?

ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 AD సినిమాకు భారీ హైప్ నెలకొంది. ఈ సినిమాకు ఓవర్సీస్ ప్రీమియర్లలో రికార్డ్ బిజినెస్ జరుగుతోంది. భారీ వసూళ్లు సాధించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం యొక్క ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఇటీవలే ముంబైలో జరిగింది. సినిమా బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతూ ఉంది. కల్కి 2898 AD మేకర్స్ రికార్డ్ ధరలను కోట్ చేయడంతో, డిస్ట్రిబ్యూటర్లు షాక్ అవుతోంది. నిర్మాతలు సినిమాపై మంచి నమ్మకంతో ఉండడంతో సినిమాను తక్కువ ధరకు విక్రయించడానికి ఇష్టపడలేదు.

తెలుగు రాష్ట్రాలలో థియేట్రికల్ బిజినెస్ 180 కోట్ల రేంజ్‌లో ఉంది. మిగిలిన సౌత్ ఇండియా దాదాపు 50 కోట్లు, నార్త్ ఇండియా 100 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ దాదాపు 100 కోట్లు పలికింది. బ్రేక్ ఈవెన్ కోసం, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల గ్రాస్‌ ను వసూలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి సినిమా హిట్ స్టేటస్ కోసం సలార్, బాహుబలి 1 కంటే పెద్ద హిట్ గా మారాలి.

Next Story