కాజల్‌ అగర్వాల్‌ కొత్త పేరు ఏంటో తెలుసా..?

Kajal Aggarwal on changing name to Kajal Kitchlu. బాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్ వివాహం చేసుకున్న తర్వాత ఈ ముద్దుగుమ్మ తన పేరును ఇన్‌స్టాగ్రామ్‌లో మార్చుకుంది.

By Medi Samrat  Published on  9 Feb 2021 4:41 AM GMT
Kajal Aggarwal on changing the name to Kajal Kitchlu

బాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 15 సంవత్సరాలైంది. తన కెరీర్‌లో గ్లామర్‌ పాత్రలు, సీరియల్‌ పాత్రలతో కాకుండా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుకునే పాత్రలను సైతం నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ భామ. గత సంవత్సరం కాల్‌ తన చిన్ననాటి మిత్రుడైన గౌతమ్‌ కిచ్లుని పెళ్లిని చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది.

వివాహం అయిన తర్వాత కాజల్‌ తన భర్తతో కలిసి మాల్దివులు పర్యటనకు వెళ్లగా, అక్కడ అందచందాలకు మంత్ర ముగ్దులయ్యారు. సముద్రపు నీటి మధ్య వీరిద్దరు కలిసి దిగిన ఫోటోలో సోషల్‌ మీడియాలో వైరస్‌ అయ్యాయి. అయితే వివాహం చేసుకున్న తర్వాత ఈ ముద్దుగుమ్మ తన పేరును ఇన్‌స్టాగ్రామ్‌లో మార్చుకుంది.

తన భర్త పేరు, తన ఇంటి పేరు కలిసి వచ్చేలా 'కాజల్‌ ఎ కిచ్లు' అని పెట్టుకుంది. కాజల్‌ అగర్వాల్‌ ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీ తెరకెక్కుతోంది. ఇక కాజల్‌ అగర్వాల్‌ లైవ్‌ టెలికాస్ట్‌ అనే వెబ్‌ సీరిస్‌ ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.




Next Story
Share it