గర్భవతి అంటూ వస్తున్న పుకార్లపై.. కాజల్ ఏమందంటే.!
Kajal aggarwal finally opens up on pregnancy rumors. గర్భవతి విషయంపై స్పందిస్తానని, మాతృత్వం అనేది మహిళలందరికి అద్బుతమైన అనుభూతి అని
By అంజి Published on 9 Nov 2021 2:15 PM ISTలక్ష్మీ కల్యాణం చిత్రం ద్వారా తెలుగులో 2007లో హీరోయిన్‌గా ఆరంగేట్రం చేసిన కాజల్.. ఆ తర్వాత మగధీర చిత్రంలో మిత్రవింద పాత్రలో నటించి అభిమానుల గుండెల్లో చెరగని ముద్రవేసింది. ఈ అందాల చందమామ దాదాపు 10 ఏళ్ల తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగింది. కేరీర్ మాంచి ఊపు మీదున్న సమయంలో తన బాయ్‌ఫ్రెండ్ గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుంది. కొవిడ్ సమయంలో గత సంవత్సరం అక్టోబర్ 30న వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. పైళ్ల సంవత్సరం పూర్తైన సందర్భంగా ఇటీవల కాజల్ ఫస్ట్ యానివర్సరీ కూడా జరుపుకుంది. అయితే గత కొన్ని రోజులుగా కాజల్ గర్భవతి అంటూ, పండంటి బిడ్డకు జన్మను ఇవ్వబోతోంది అంటూ సోషల్ మీడియా వేదికగా పుకార్లు వస్తున్నాయి. వీటిపై కాజల్ అగర్వాల్ ఓ ఇంటర్య్వూలో స్పందించారు.
సమయం వచ్చినప్పుడు గర్భవతి విషయంపై స్పందిస్తానని, మాతృత్వం అనేది మహిళలందరికి అద్బుతమైన అనుభూతి అని పేర్కొంది. నాకు సంబంధించినంత వరకు ఓ వైపు అనుభూతి చెందుతూనే మరోవైపు భయంగా అనిపిస్తోందని అన్నారు. నా సోదరి నిషా తల్లి అయిన సమయంలో తను ఎలాంటి అనుభవాలను ఫేస్ చేసిందో దగ్గరి నుండి గమనించానని, ఇప్పుడు కూడా తనెలా ఫీల్ అవుతుందో చూస్తున్నానని కాజల్ అంది. నా చెల్లి పిల్లలను చూస్తుంటే ఇప్పటికీ తాను తల్లిలా ఫీలవుతానని అంది. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తుంది. హిందీ, తమిళంలోనూ కాజల్ సినిమాలు చేస్తోంది. బాలీవుడ్‌లో ఉమ అనే సినిమాలో కాజల్ నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.