పైసా ఖ‌ర్చులేకుండా హ‌నీమూన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేసిన కాజ‌ల్‌..!

Kajal Aggarwal enjoyed her honeymoon in Maldives without spending single paisa. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజ‌ల్

By Medi Samrat  Published on  7 Dec 2020 8:30 AM GMT
పైసా ఖ‌ర్చులేకుండా హ‌నీమూన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేసిన కాజ‌ల్‌..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ ముంబైకి చెందిన వ్యాపార వేత్త గౌత‌మ్ కిచ్లూను ఇటీవ‌ల వివాహాం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వివాహం అనంత‌రం ఈ జంట‌.. హ‌నీమూన్ కోసం మాల్దీవుల‌కు వెళ్లొచ్చారు. మాల్దీవుల్లోని అందాలను ఆస్వాదించి, సముద్ర‌పు అందాల నడుమ భర్తతో కలిసి గడిపి, ఫొటోలు తీసుకుని కాజ‌ల్.. త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోలు ఇటీవల వైరల్ అయ్యాయి.

ప్ర‌పంచంలోనే మొట్ట‌మొద‌టి నీటి అడుగున్న ఉన్న ది మురాకా హోట‌ల్‌లో కాజ‌ల్ జంట బ‌స చేశారు. సాధారణంగా ఆ హోటల్‌లో ఒక్క రాత్రి ఉండాలంటే రూ.38 లక్షలు ఖర్చు అవుతుంది. కాజల్ తన భర్తతో కలిసి 10 రోజులు ఉంది. అందుకోసం ఆమె దాదాపు రూ.5 కోట్ల వరకు ఖర్చు చేసిందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే.. తాజా స‌మాచారం ప్ర‌కారం ఆమె ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా హనీమూన్ ట్రిప్ ను ఎంజాయ్ చేసినట్లు తెలిసింది.

పర్యాటక ప్రదేశాలను ప్రమోట్ చేసుకోవడం కోసం సెలబ్రిటీలకు మాల్దీవుల్లో ఫైవ్ స్టార్ భోజ‌నంతో పాటు వ‌స‌తి ఫ్రీగా అందిస్తున్నార‌ట‌. ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉంటే ఈ ఆఫర్ పొందొచ్చు.కాజ‌ల్ అగ‌ర్వాల్ ను 16 మిలియ‌న్ల మంది ఫాలో అవుతున్న విష‌యం తెలిసిందే. దీంతో స్వ‌యంగా హోట‌ల్ యాజ‌మాన్య‌మే ఫోన్ చేసీ మ‌రీ ఫ్రీ టూర్ గురించి చెప్పి కేవ‌లం దుస్తులు మాత్ర‌మే వెంట తెచ్చుకోమ‌ని చెప్పింద‌ట‌. దీంతో కాజల్ ఉచితంగా హనీమూన్ ఎంజాయ్ చేసిందని ప‌లు జాతీయ ప‌త్రిక‌లో వార్త‌లు వ‌చ్చాయి.
Next Story
Share it