పొగ త్రాగరాదు.. కానీ కాజల్ మాత్రం దమ్ము మీద దమ్ము..
Kajal Agarwal Smoke For Web Series. తెలుగు ఇండస్ట్రీలోకి తేజ దర్శకత్వంలో 'లక్ష్మీ కళ్యాణం' చిత్రంతో హీరోయిన్ గా
By Medi Samrat Published on 13 Feb 2021 12:06 PM ISTతెలుగు ఇండస్ట్రీలోకి తేజ దర్శకత్వంలో 'లక్ష్మీ కళ్యాణం' చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కలువకళ్ల సుందరి కాజల్ అగర్వాల్. ఆ తర్వాత యంగ్ హీరోల సరసన జోడీ కట్టి అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ పదేళ్ల నుంచి తన సత్తా చాటుతుంది. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాన్,రామ్ చరణ్,అల్లు అర్జున్ లాంటి మెగా హీరోల సరసన నటించింది. ఇటీవల కాలంలో కాస్త జోరు తగ్గిన సమయంలో అప్ కమింగ్ హీరోల సరసన కూడా ఓకే చెప్పింది. అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్ లో కూడా మెరుస్తుంది. లాక్ డౌన్ సమయంలో తాను ప్రేమించిన గౌతమ్ కిచ్లు పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ భామ చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తోన్న 'ఆచార్య'తో పాటు మంచు విష్ణు మోసగాళ్లులో నటిస్తోంది.
అలాగే తమిళ్‌లో కమల్ హాసన్ సరసన ఇండియన్ 2లో నటిస్తున్న విషయం తెలసిందే. అంతేకాదు తొలిసారి ఓ వెబ్ సిరీస్‌తో అభిమానులను పలకరించడానికి రెడీ అవుతోంది. 'లైవ్ టెలికాస్ట్' పేరుతో తెరకెక్కిన వెబ్ సిరీస్‌లో కాజల్ నటిస్తోంది. దీనిని తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా.. ఈ వెబ్ సిరీస్‌లో కాజల్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది. చేతిలో సిగరేట్ పట్టుకున్న కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇవి చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. అమాయకంగా కనిపించే కాజల్ సిగరెట్ కాల్చడం ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. వాస్తవానికి కాజల్ నిజంగా ధుమపానం చేసినప్పటికీ అది వెబ్ సిరీస్‌లో భాగంగానే అలా చేసిందని.. సిరీస్‌లో కొన్ని మాస్ సీన్స్‌లో కాజల్ సిగరెట్ కాల్చే సందర్భాలు ఉండటంతో సిగరెట్ కాల్చిందని అంటున్నారు. అసలు విషయం తెలుసుకొని హమ్మయ్య తమ మిత్ర విందకు ఈ అలవాటు లేదులే అని ఊపిరి పీల్చుకున్నారు.