NTR for Dhamki : దాస్ కోసం వస్తున్న జూనియర్ ఎన్టీఆర్

Jr NTR to be chief guest for ‘Das Ka Dhamki’ pre-release event. విష్వక్సేన్ హీరో గా నటించిన 'దాస్ కా ధమ్కీ' సినిమా విడుదలకు రెడీ అవుతోంది.

By Medi Samrat
Published on : 15 March 2023 11:12 AM

NTR for Dhamki : దాస్ కోసం వస్తున్న జూనియర్ ఎన్టీఆర్

NTR, Vishwak Sen


విష్వక్సేన్ హీరో గా నటించిన 'దాస్ కా ధమ్కీ' సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమాలో విష్వక్సేన్ హీరోగా చేయడమే కాకుండా.. దర్శక నిర్మాతగాను వ్యవహరిస్తున్నాడు. ఈ నెల్ 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయన్నున్నారు. విష్వక్సేన్ జోడీగా నివేదా పేతురాజ్ నటించిన ఈ సినిమాకి, లియోన్ జేమ్స్ సంగీతాన్ని సమకూర్చారు. 'పాగల్' తరువాత విష్వక్సేన్ - నివేదా పేతురాజ్ కలిసి నటించిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

ఈ నెల 17వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదు - శిల్పకళా వేదికలో జరగనుంది. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. ఈ వేడుకకి చీఫ్ గెస్టుగా ఎన్టీఆర్ హాజరు కానున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు.


ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ కోసం అమెరికాలోని లాస్ ఏంజెలెస్ వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ఈ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటునాటు’ పాట అకాడమీ అవార్డు సొంతం చేసుకుంది. ఇక హైదరాబాద్‌ చేరుకున్న ఎన్టీఆర్‌కు ఘన స్వాగతం లభించింది. అభిమానుల కోలాహలంతో శంషాబాద్ విమానాశ్రయం రద్దీగా మారింది. విమానాశ్రయం బయట ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘నాటునాటు’ పాటకు ఆస్కార్ వచ్చినందుకు గర్వంగా ఉందన్నారు. తమకు సపోర్ట్ చేసిన ప్రతి భారతీయుడికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నట్టు చెప్పారు.



Next Story