విడుద‌ల‌కు సిద్ద‌మైన విశ్వ‌క్ సేన్ ధ‌మ్కీ

Vishwak Sen's Das Ka Dhamki release date out.విశ్వ‌క్‌సేన్‌ హీరోగా 'ధమ్కీ' సినిమా రూపొందుతోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Nov 2022 7:38 AM GMT
విడుద‌ల‌కు సిద్ద‌మైన విశ్వ‌క్ సేన్ ధ‌మ్కీ

యంగ్ హీరో విశ్వ‌క్‌సేన్ న‌టిస్తున్న తాజా చిత్రం 'ధ‌మ్కీ'. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ క‌థానాయిక‌. ఇటీవ‌లే విడుద‌లైన ఈ చిత్ర ఫ‌స్ట్‌లుక్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ల‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ఎప్పుడు విడుద‌ల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం విడుద‌ల తేదీపై క్లారిటీ ఇచ్చింది.

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ బాష‌ల్లో 17 ఫిబ్ర‌వ‌రి 2023లో ప్రేక్ష‌కుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకురానున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ మేర‌కు ఓకొత్త పోస్ట‌ర్‌ను వ‌దిలారు. అందులో విశ్వ‌క్ జీన్స్‌, సూట్ ధ‌రించి చేతిలో కర్రపట్టుకుని ఉన్నాడు. భమ్‌ భోలేనాథ్ 2023 శివరాత్రికి మీముందుకు వస్తున్నాడు అని రాసుకొచ్చారు. ఈ చిత్రానికి విశ్వ‌క్‌సేన్‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. రావు రమేశ్, పృథ్విరాజ్‌, హైపర్‌ ఆది కీలక పాత్రల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి లియోన్‌ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. వన్మయి క్రియేషన్స్‌, విశ్వక్‌ సేన్ సినిమాస్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Next Story
Share it