మరో న్యూడ్ ఫోటో షూట్ రచ్చ.. ఈసారి స్టార్ సెలెబ్రిటీ

Jennifer Lopez marks 53rd birthday with nude photoshoot. ఇటీవలి కాలంలో న్యూడ్ ఫోటో షూట్ ల రచ్చ కొనసాగుతూ ఉన్న సంగతి తెలిసిందే..!

By Medi Samrat  Published on  25 July 2022 2:55 PM IST
మరో న్యూడ్ ఫోటో షూట్ రచ్చ.. ఈసారి స్టార్ సెలెబ్రిటీ

ఇటీవలి కాలంలో న్యూడ్ ఫోటో షూట్ ల రచ్చ కొనసాగుతూ ఉన్న సంగతి తెలిసిందే..! రణవీర్ సింగ్ చేసిన న్యూడ్ ఫోటో షూట్ పై ఇప్పటికీ చర్చ కొనసాగుతూ ఉంది. 53 ఏళ్లు నిండిన సింగర్ జెన్నిఫర్ లోపెజ్ తన న్యూడ్ ఫోటోషూట్‌ను షేర్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది. జెన్నిఫర్ ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. స్కిన్ కేర్ విషయంలో ఆమె ప్రోడక్ట్స్ కోసం ఈ న్యూడ్ ఫోటో షూట్ చేసింది. జెన్నిఫర్ లోపెజ్ బ్యూటీ బ్రాండ్ కోసం ఓ వీడియోను విడుదల చేసింది.

"We give all this care and attention to the skin on our face, but we sometimes neglect the body. It was important to me to create a skincare routine for the body to address its specific and unique needs, and we started with the booty," ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది.

లాస్ వెగాస్‌లో బెన్ అఫ్లెక్‌ ను పెళ్లి చేసుకున్న తర్వాత జెన్నిఫర్ తన మొదటి పుట్టినరోజును జరుపుకుంది. 2002లో `గిగ్లీ` సినిమా సెట్‌లో కలిసిన తర్వాత బెన్ జెన్నిఫర్‌కు ప్రపోజ్ చేశాడు. ఈ జంట 2004లో తమ నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. ఇక మే 2021లో మోంటానాలో విహారయాత్రలో ఉన్నప్పుడు చేతులు పట్టుకుని కనిపించి మరోసారి పుకార్లకు దారితీసింది.




Next Story