మల్లయోధుల బృందంతో పవన్ కళ్యాణ్..!
Janasena chief PawanKalyan felicitates wrestlers. అవినీతిపై పోరాటం చేయాలంటే మానసిక దారుఢ్యంతో పాటు శారీరక దారుఢ్యం చాలా అవసరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
By Medi Samrat Published on
28 Feb 2021 9:52 AM GMT

అవినీతిపై పోరాటం చేయాలంటే మానసిక దారుఢ్యంతో పాటు శారీరక దారుఢ్యం చాలా అవసరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. మానసికంగా, శారీరకంగా బలంగా లేకపోతే రౌడీలు, అవినీతిపరులు రాజ్యమేలుతారని పేర్కొన్నారు. హైదరాబాద్లో ఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర నుంచి వచ్చిన 16 మంది మల్లయోధుల బృందాన్ని ఆయన సత్కరించారు.
ప్రాచీన యుద్ధ విద్యలకు మన దేశం పేరెన్నికగన్నదని.. కొన్ని దశాబ్దాలుగా ఆదరణకు నోచుకోక అంతరించిపోయే దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా వంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ యుద్ధ విద్య సంస్కృతి బతికే ఉందన్నారు. తమ పిల్లలను కూడా యుద్ధ విద్యలను అభ్యసించడానికి పంపించాలని జనసైనికులను కోరారు. భారతదేశంలో బలమైన సమాజం పునర్నిర్మాణానికి మన తెలుగు వారు కూడా కృషి చేయాలని కోరారు.
Next Story