తెలుగు రాష్ట్రాల్లో మరో రికార్డును కొల్లగొట్టిన జైలర్

సూపర్ స్టార్ రజనీకాంత్ తన తాజా చిత్రం జైలర్‌తో తెలుగు రాష్ట్రాల్లో కూడా సత్తా చాటారు.

By Medi Samrat  Published on  22 Aug 2023 9:15 PM IST
తెలుగు రాష్ట్రాల్లో మరో రికార్డును కొల్లగొట్టిన జైలర్

సూపర్ స్టార్ రజనీకాంత్ తన తాజా చిత్రం జైలర్‌తో తెలుగు రాష్ట్రాల్లో కూడా సత్తా చాటారు. అన్నాత్తే పరాజయం తర్వాత యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన జైలర్ సినిమా సూపర్ స్టార్ అభిమానులకు తెగ నచ్చేసింది. మూవీ లవర్స్ కు కూడా సినిమా మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. ఈ చిత్రం పలు కేంద్రాలలో రికార్డ్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. జైలర్ ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లు దాటగా, తెలుగు రాష్ట్రాల్లో మరో బెంచ్ మార్క్ క్రాస్ చేసింది.

ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 40 కోట్ల షేర్ మార్క్‌ను దాటింది. తెలుగు రాష్ట్రాల్లో 40 కోట్ల రూపాయల మార్కును దాటిన రజనీకాంత్ రెండవ చిత్రంగా ఇది నిలిచింది. రోబో 2.0, జైలర్ మాత్రమే తమిళ డబ్బింగ్ సినిమాల్లో తెలుగు రాష్ట్రాల్లో 40 కోట్ల షేర్ మార్క్‌ను దాటాయి. ఈ సినిమా హక్కులు 13 కోట్లకు కొనుగోలు చేశారు. ఇది 40 కోట్లను వసూలు చేసింది. జైలర్ సినిమాలో..తమన్నా, రమ్యకృష్ణ,సునీల్,యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు. మలయాళ సూపర్‌ స్టార్ మోహన్ లాల్‌, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్‌ కూడా ప్రత్యేక పాత్రల్లో కనిపించి అదుర్స్ అనిపించారు. అనిరుధ్‌ రవిచందర్‌ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది. సన్‌ పిక్చర్స్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించాయి.

Next Story