ఇంద్ర రీరిలీజ్‌కు ముహూర్తం ఖరారు

మెగాస్టార్ చిరంజీవి మూవీ కెరీర్ లో ఇంద్ర సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. B. గోపాల్ దర్శకత్వం వహించిన ఇంద్ర (2002) సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్. ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది

By Medi Samrat  Published on  24 July 2024 5:54 PM IST
ఇంద్ర రీరిలీజ్‌కు ముహూర్తం ఖరారు

మెగాస్టార్ చిరంజీవి మూవీ కెరీర్ లో ఇంద్ర సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. B. గోపాల్ దర్శకత్వం వహించిన ఇంద్ర (2002) సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్. ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. టాలీవుడ్ రికార్డులను మొత్తం కొల్లగొట్టింది. ఈ సినిమా రికార్డులను ఆ తర్వాత మహేష్ బాబు పోకిరి (2006) ద్వారా అధిగమించింది. పోకిరి అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా అవతరించింది.

ఇంద్ర సినిమా కంప్లీట్ మీల్స్ అనే చెప్పొచ్చు. కామెడీ, రొమాన్స్, యాక్షన్, డ్రామా, సంగీతం అన్నీ అద్భుతంగా సెట్ అయ్యాయి. ఇంద్ర తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులకు మాస్ ఫీస్ట్. మణిశర్మ పాటలు విశేష ఆదరణ పొందాయి. ప్రత్యేకించి చిరు అద్భుతమైన డ్యాన్స్ ను వెండితెర మీద చూడడానికి అప్పట్లో తెగ క్యూ కట్టారు. ఇక ఈ సినిమా రీరిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. గతంలో పలు మార్లు రీరిలీజ్ చర్చ జరిగినా కూడా అది జరగలేదు.

ఇక ఈ చిత్రం 22 ఆగస్ట్, 2024న గ్రాండ్ రీ-రిలీజ్ చేయడానికి సిద్ధమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ క్లాసిక్‌ రీ రిలీజ్ కు సంబంధించిన అధికారిక ప్రకటనను నిర్మాణ స్టూడియో వైజయంతీ ఫిల్మ్స్ పంచుకుంది. ఇక ఆగస్టు 22న మరోసారి థియేటర్లు 'దాయి దాయి దామా' అంటూ మోత మోగిపోనున్నాయి.

Next Story