అద్భుతమైన ఓపెనింగ్ ను దక్కించుకున్న ఇంద్ర 4K

టాలీవుడ్‌లో రీ-రిలీజ్ ట్రెండ్ కొనసాగుతూ ఉంది. ఇంద్ర సినిమాని ఆయన పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేశారు

By Medi Samrat  Published on  23 Aug 2024 9:45 PM IST
అద్భుతమైన ఓపెనింగ్ ను దక్కించుకున్న ఇంద్ర 4K

టాలీవుడ్‌లో రీ-రిలీజ్ ట్రెండ్ కొనసాగుతూ ఉంది. ఇంద్ర సినిమాని ఆయన పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేశారు. మిడ్‌వీక్ రిలీజ్ అయినప్పటికీ, AP, తెలంగాణా అంతటా 380 స్క్రీన్‌లలో ఇంద్ర ప్రభంజనం సృష్టించింది. ఇంద్ర 4K ఓవర్సీస్, హైదరాబాద్, బెంగుళూరు వంటి ప్రధాన నగరాల్లో మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఓవరాల్ గా సినిమాకు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. ఇంద్ర మ్యాజిక్‌ని పెద్ద స్క్రీన్‌లపై ప్రేక్షకులు ఆస్వాదించారు. USAలో కూడా ఇంద్ర చిత్రం మంచి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. రీ-రిలీజ్ అయిన మురారి సీడెడ్‌లో 35L గ్రాస్ వసూలు చేయగా, ఇంద్ర దాదాపు 27L గ్రాస్ వసూలు చేసింది.

ఓవరాల్‌గా ఇంద్రకి ఆశ్చర్యకరమైన, అద్భుతమైన ఓపెనింగ్స్ ఉన్నాయి. ఓపెనింగ్ డే గ్రాస్ దాదాపు 3.25 కోట్లు ఉందని అంచనా.. ఇది సీనియర్ స్టార్ హీరోలకు సంబంధించి రీ-రిలీజ్‌లలో రికార్డ్ ఓపెనర్. రాబోయి రోజుల్లో మాస్, గబ్బర్ సింగ్ లాంటి భారీ రీరిలీజులు ఉన్నాయి.

Next Story