'ఇండియన్ 2' విడుదల తేదీ మ‌ళ్లీ మారిందా..?

సౌత్ సూపర్ స్టార్ కమల్ హాసన్ నటిస్తున్న 'ఇండియన్ 2' సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది.

By Medi Samrat  Published on  15 May 2024 5:59 AM GMT
ఇండియన్ 2 విడుదల తేదీ మ‌ళ్లీ మారిందా..?

సౌత్ సూపర్ స్టార్ కమల్ హాసన్ నటిస్తున్న 'ఇండియన్ 2' సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టికే సినిమా విడుదల తేదీని పలుమార్లు మార్చారు. అలాగే ఈ ఏడాది చాలా బాలీవుడ్ చిత్రాల విడుదల తేదీలు మారాయి. 'కల్కి 2898 AD' నుండి 'బడే మియాన్ ఛోటే మియాన్' వంటి చిత్రాల విడుదల తేదీని చాలాసార్లు మార్చారు. ఇప్పుడు కమల్ హాసన్ సినిమా 'ఇండియన్ 2' విడుదల తేదీ కూడా మారింది. ముందుగా ఈ సినిమా జూన్ 13, 2024న విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల జూలై నెలలో విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించుకున్నారు.

మీడియా నివేదికల ప్రకారం.. 'ఇండియన్ 2' పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాలేదు. ఈ కారణంగా చిత్రాన్ని జూలైలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. 'ఇండియన్ 2' జూలై 12, 2024న థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉందని నివేదిక‌లు చెబుతున్నాయి. అయితే ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి చిత్ర నిర్మాతలు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

కమల్ హాసన్ దర్శకుడు శంకర్ కాంబోలో వ‌స్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్‌తో పాటు సిద్ధార్థ్, బాబీ సింహా, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీ ఉండడంతో ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారు.

Next Story