భారతీయుడు-2 మొదటి రోజు కలెక్షన్స్ ఎంతంటే?

భారతీయుడు 2 సినిమాకు మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ వచ్చాయి.

By Medi Samrat  Published on  13 July 2024 8:22 PM IST
భారతీయుడు-2 మొదటి రోజు కలెక్షన్స్ ఎంతంటే?

భారతీయుడు 2 సినిమాకు మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా తమిళ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్ కు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా టోటల్ షేర్ 5.8 కోట్లు కాగా, జీఎస్టీని కలుపుకుంటే అది 6.7 కోట్లకు చేరుకుంది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విలువ 25 కోట్లు. మొదటి రోజు రికవరీ ప్రీ-బిజ్‌లో 27% పూర్తయింది. బ్రేక్ ఈవెన్ మార్క్‌ని చేరుకోవడానికి ఈ వీకెండ్ మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఈ చిత్రం తమిళ మార్కెట్‌లోనూ మంచి వసూళ్లను మొదటిరోజు సొంతం చేసుకుంది.

నైజాం : 2.5 కోట్లు

ఉత్తరాంధ్ర: 0.7 కోట్లు

తూర్పు: 0.43 కోట్లు

గుంటూరు: 0.55 కోట్లు

కృష్ణా: 0.38 కోట్లు

వెస్ట్: 0.26 కోట్లు

నెల్లూరు: 0.2 కోట్లు

సెడెడ్: 0.8 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు వసూళ్లు దాదాపు 50 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. ఈ సినిమాను ఇంకా కొనసాగింపుగా ఇండియన్ 3 రావాల్సి ఉంది. మూడో భాగం కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు.

Next Story