నేను పాకిస్థానీ కాదు : ప్రభాస్ హీరోయిన్

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడులు దేశ ప్రజలను దిగ్భ్రాంతిని కలిగించాయి.

By Medi Samrat
Published on : 24 April 2025 2:38 PM IST

నేను పాకిస్థానీ కాదు : ప్రభాస్ హీరోయిన్

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడులు దేశ ప్రజలను దిగ్భ్రాంతిని కలిగించాయి. ఈ సంఘటన తర్వాత నెటిజన్లు భారతీయ చిత్ర పరిశ్రమలోని పాకిస్తానీ నటులు, నటీమణులను బహిష్కరించాలని పిలుపు ఇచ్చారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటించబోయే సినిమాలో నటిస్తున్న ఇమాన్వి ఎస్మాయిల్ పేరును ట్రెండ్ చేయడం ప్రారంభించారు.ఆమెను పాకిస్తానీ పౌరురాలిగా అభివర్ణించారు.

ఈ పుకార్లను ప్రభాస్ హీరోయిన్ కొట్టిపారేసింది. తాను పాకిస్తాన్ పౌరురాలనే ఆరోపణలు, పుకార్లను ఖండిస్తూ ఆమె తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక నోట్ పోస్ట్ చేసింది. తన తల్లిదండ్రులు చిన్నతనంలోనే అమెరికాకు వెళ్లారని, తాను భారతీయురాలిగా పెరిగానని ఇమాన్వి చెప్పారు. కల్పిత వార్తలను వ్యాప్తి చేయడం మానేయాలని ఇమాన్వి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తన పని ద్వారా భారతీయ సినిమా వారసత్వాన్ని కొనసాగించడానికి, తన భారతీయ వారసత్వ అనుభవాన్ని పెంపొందించడానికి తాను కృషి చేస్తానని కూడా ఆమె తెలిపారు.

Next Story