ఆ రోజు నుంచి ఇండియాలో ఐ-బొమ్మ సర్వీసులు బంద్‌..!

Ibomma decides to shut down their website for india users. ఐబొమ్మ భారతదేశంలో తమ సర్వీసులను పూర్తిగా నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.

By Medi Samrat  Published on  5 Sep 2022 12:51 PM GMT
ఆ రోజు నుంచి ఇండియాలో ఐ-బొమ్మ సర్వీసులు బంద్‌..!

ఐబొమ్మ భారతదేశంలో తమ సర్వీసులను పూర్తిగా నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 9 నుంచి ఇండియాలో తమ ఆపరేషన్లను పూర్తిగా మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది. మరోసారి తిరిగి వచ్చే ఆలోచన తమకు లేదని.. ఇందుకు సంబంధించి తమకు ఎవరూ మెయిల్స్ చేయవద్దని ప్రేక్షకులను కోరింది. తమ పై ఇంత ప్రేమ చూపిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. ఐబొమ్మలో ఓటీటీలో విడుదలయ్యే అన్ని సినిమాలను డబ్బులు వెచ్చించకుండానే హై క్వాలిటీలో ఫ్రీగా చూడొచ్చు. సినిమా మొత్తాన్ని డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు. దీంతో ఐబొమ్మను ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. ఇది పైరసీ కిందకే వస్తుంది. ఓటీటీలకు డబ్బులు చెల్లించుకోలేని వారు.. ఇందులో చూస్తూ ఉంటారు.

కొద్దిరోజుల కిందట.. తమ సేవలను ఇండియాలో పూర్తిగా నిలివేస్తున్నట్లు ప్రకటించి.. ఆ తర్వాత తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. రెండు రోజుల క్రితం ఐబొమ్మ వెబ్ సైట్ నుంచి సినిమాలను డౌన్ లోడ్ చేసుకోవడానికి వీలు లేదని తెలిపింది. ఇక ఇప్పుడు సెప్టెంబర్ 9 నుంచి తమ సేవలను పూర్తిగా షట్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించింది.


Next Story