నాగ చైతన్యను ఒక్క స్టేట్‌మెంట్ ఇవ్వమని అడుగుతున్నాడే పాపం
I wish Naga Chaitanya had spoken up when trolls linked Samantha with me. అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారంపై ఇంకా చర్య కొనసాగుతూనే ఉంది
By Medi Samrat Published on 11 Oct 2021 7:16 AM GMT
అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారంపై ఇంకా చర్య కొనసాగుతూనే ఉంది. ఎందుకు విడిపోతున్నామనే విషయంపై ఇద్దరూ క్లారిటీ ఇవ్వలేదు. సమంత పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్‌పై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. చై-సామ్ విడిపోవడానికి ప్రీతమ్ కారణమంటూ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రీతమ్ మీడియాతో మాట్లాడాడు. సమంతను తాను `అక్కా` అని పిలుస్తానని స్పష్టం చేశాడు. `నేను సమంతను `అక్కా` అని పిలుస్తాననే సంగతి చాలా మందికి తెలుసు. అలాంటిది మా మధ్య ఎఫైర్ ఎందుకు ఉంటుంది. `ఐ లవ్యూ` అని సోషల్ మీడియాలో ఎందుకు కామెంట్ చేశావని చాలా మంది అడుగుతున్నారు. కుటుంబ సభ్యులకు, సోదరిగా భావించే వారికి `ఐ లవ్యూ` చెప్పడం తప్పెలా అవుతుంది.
ఎంతో మంది నన్ను బూతులు తిడుతూ మెసేజ్‌లు చేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వస్తే చంపేస్తామని హెచ్చరిస్తున్నారని తెలిపారు. నా కెరీర్‌ను నాశనం చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపాడు. నాగచైతన్య నాకు ఎన్నో ఏళ్లుగా తెలుసు. సమంతకు, నాకు మధ్య ఉన్న అనుబంధం గురించి చైతన్యకు స్పష్టంగా తెలుసు. నాకు, సమంతకు ఎఫైర్ ఉందని వస్తున్న కామెంట్ల గురించి నాగచైతన్య స్పందించకపోవడం చాలా బాధ కలిగిస్తోంది. ఆయన ఒక్క స్టేట్మెంట్ ఇస్తే పరిస్థితిలో చాలా మార్పు వస్తుందని అన్నాడు. ప్రస్తుతం సమంత విషాదంలో ఉంది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆమెకు కచ్చితంగా మద్దతుగా ఉంటానని ప్రీతమ్ చెప్పాడు. నాగ చైతన్య ఒక్క స్టేట్మెంట్ ఇస్తే మాత్రం ప్రీతమ్ పై ఎటువంటి ట్రోలింగ్ జరగకపోవచ్చు.