హీరోల భార్యలపై సంచలన కామెంట్స్ చేసిన తాప్సీ
I was replaced because hero’s wife didn’t want me. పలు విజయవంతమైన చిత్రాలలో నటించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చు
By Medi Samrat
పలు విజయవంతమైన చిత్రాలలో నటించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుసగా మహిళా ప్రధాన చిత్రాలలో నటిస్తోంది. అయితే తాను ప్రస్తుతం ఉన్న స్థితికి రావడానికి చాలా ఇబ్బందులు పడ్డానని.. ఈ పేరు ప్రఖ్యాతులు తనకు సులభంగా లభించలేదని.. ఎన్నో అవహేళనల్ని దాటుకొని విజయాల్ని సొంతం చేసుకున్నానని పేర్కొంది. కెరీర్ ఆరంభంలో ఐరన్‌లెగ్ అంటూ తనపై చేసిన ప్రచారం పరిశ్రమలో రాణించాలనే తపనను పెంచిందని తాప్సీ చెప్పింది.
ఒకప్పుడు దర్శకనిర్మాతలు నాకు అవకాశాలు ఇచ్చేవారు కాదని.. తాప్సీ దురదృష్టానికి సంకేతం అంటూ దుష్ప్రచారం చేసేవారని.. ఒకానొక దశలో హీరో భార్యకు నేను నటించడం ఇష్టం లేదనే కారణంతో ఓ సినిమా నుంచి నన్ను తప్పించారని వాపోయింది. మరో సినిమా విషయంలో డబ్బింగ్ సరిగ్గా చెప్పడం లేదని.. నా వాయిస్‌ను తొలగించి డబ్బింగ్ ఆర్టిస్టుతో సంభాషణల్ని చెప్పించారని.. ఈ విషయంపై నాకు సమాచారం కూడా ఇవ్వలేదని పేర్కొంది.
మరీ దారుణమైన సంగతి ఏమిటంటే.. ఓ హీరో నటించిన గత చిత్రం ఫెయిల్ అయింది కాబట్టి అతనితో పాటు నన్ను కూడా రెమ్యునరేషన్ తగ్గించుకోమని బలవంతం చేశారని.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అవమానాల్ని భరించానని గత అనుభవాలను షేర్ చేసుకుంది. అయితే.. అలా ముందుకుసాగుతూనే కథల ఎంపికలో నా పంథా మార్చుకున్నానని.. బలమైన సందేశం ఉన్న మహిళా ఇతివృత్తాల్లో నటించి నా ప్రతిభను చాటుకున్నాని తాప్సీ చెప్పింది.