షారుఖ్ ఖాన్ సరసన తాప్సీ

I am going to share screen with Shahrukh Khan. నటి తాప్సీ పన్ను వరుస చిత్రాలతో ఎంతో బిజీగా ఉంది. ఆమె నటించబోయే చిత్రాల్లో

By Medi Samrat  Published on  3 July 2022 6:00 PM IST
షారుఖ్ ఖాన్ సరసన తాప్సీ

నటి తాప్సీ పన్ను వరుస చిత్రాలతో ఎంతో బిజీగా ఉంది. ఆమె నటించబోయే చిత్రాల్లో ఒకటి షారుక్ ఖాన్ తో చేయబోయే 'డంకీ'. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, ప్రముఖ చిత్రనిర్మాత రాజ్‌కుమార్ హిరానీ తో కలిసి చేస్తున్న మొదటి సినిమా. ఈ సినిమా మీద భారీ హైప్ ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ గా తాప్సీని ఎంచుకున్నారు. తాజాగా మీడియా ఇంటరాక్షన్‌లో ఈ సినిమాలో భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది.

'షారుఖ్ స‌ర‌స‌న న‌టించాల‌ని అందరూ అనుకుంటూ ఉంటారు. అలాంటి అరుదైన అవ‌కాశం నాకు ద‌క్కింది. దీనికోసం నేను ఎవ‌రిని అడుగ‌లేదు. ద‌ర్శ‌కుడు రాజ్‌కుమార్ హిరాని నా గ‌త చిత్రాల‌లో న‌ట‌ను చూసి ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపిక చేశాడ‌ని తెలిపింది. ఇప్ప‌టికే నేను ఈ ప్రాజెక్ట్‌లో భాగ‌మైన‌ట్లు న‌మ్మ‌లేక‌పోతున్నా. ఇది క‌లా? నిజ‌మా? అనిపించిందంటూ తాప్సీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాప్సీ బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా 'శభాష్ మిథు' విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో ఆమె క్రికెటర్ మిథాలీ రాజ్ పాత్రలో కనిపించనుంది.









Next Story