పెళ్లి సందడి హీరోయిన్‌ వెనుక పడుతున్న కుర్ర హీరోలు.!

Heroine sree leela gets back to back offers. తెలుగులో ఫస్ట్‌ సినిమాతోనే ఓవర్‌ నైట్‌ స్టార్‌డం సంపాదించింది హీరోయిన్‌ శ్రీలీల. కన్నడ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించిన

By అంజి  Published on  24 Oct 2021 6:04 AM GMT
పెళ్లి సందడి హీరోయిన్‌ వెనుక పడుతున్న కుర్ర హీరోలు.!

తెలుగులో ఫస్ట్‌ సినిమాతోనే ఓవర్‌ నైట్‌ స్టార్‌డం సంపాదించింది హీరోయిన్‌ శ్రీలీల. కన్నడ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ.. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో రూపుదిద్దుకున్న పెళ్లి సందడి సినిమాలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో శ్రీకాంత్‌ కుమారుడు రోషన్‌ నటించిన శ్రీలీల తన అందం, అభినయం, నటతో కుర్రకారును ఫిదా చేసింది. పెళ్లి సందడి సినిమాలో శ్రీలీల యాక్టింగ్‌కు చాలా మంది అట్రాక్ట్‌ అయ్యారు. పెళ్లి సందడి సినిమా పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ప్రస్తుతం కుర్ర హీరోలకు శ్రీలీల బెస్ట్‌ ఆప్షన్‌గా మారారు. ఈ క్రమంలోనే ఈ బ్యూటీకి వరుస సినిమా ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన డైరెక్షన్‌లో వస్తున్న ధమాకా సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా చేస్తోంది. ఐదారు సినిమాలకు సంబంధించి శ్రీలీల చర్చలు కూడా జరుపుతోందని సమాచారం. సాయిధరమ్‌తేజ్‌, నితిన్‌, నిఖిల్‌, శర్వానంద్‌ లాంటి యంగ్‌ హీరోల పక్కన మంచి అందం, అభినయం, అంతకు మించి చలాకీ తనంతో ఆకట్టుకుంటున్న శ్రీలీల పెడితే బాగుంటుందని ప్రొడ్యూసర్స్‌ భావిస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీలపై బాడా ప్రొడ్యూసర్స్‌ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మెగా కాంపౌడ్‌లోకి కూడా శ్రీలీల అడుగుపెట్టబోతోందని సమాచారం.

Next Story
Share it