పిల్లని వెతికి పెట్టండంటున్న యంగ్‌ హీరో

Hero Vishwak sen request help allam find pellam. సినీ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలో అభిమానుల నుంచి మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు హీరో విశ్వక్‌ సేన్‌.

By అంజి  Published on  13 Jan 2022 11:26 AM GMT
పిల్లని వెతికి పెట్టండంటున్న యంగ్‌ హీరో

సినీ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలో అభిమానుల నుంచి మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు హీరో విశ్వక్‌ సేన్‌. పాగల్‌, హిట్‌, ఫలక్‌నుమాదాస్‌, ఈ నగరానికి ఏమైంది, వెళ్లిపోమాకే సినిమాలతో అలరించాడు. ప్రజెంట్‌ విశ్వక్‌ సేన్‌.. "అశోకవనంలో అర్జున కళ్యాణం" అనే చిత్రంలో వడ్డీ వ్యాపారి అర్జున్‌ కుమార్‌గా నటిస్తున్నాడు. తాజాగా పిల్లని వెతికి పెట్టండి అంటూ సోషల్‌ మీడియా వేదికగా తన సినిమాకు సంబంధించి అప్‌డేట్‌ను ట్వీట్‌ చేశాడు. ఇంకా రెండు రోజులే ఉంది.. పిల్లని వెతికి పెట్టండి లేదా కనీసం పడేయటానికి టిప్స్‌ అయినా ఇవ్వండి అంటూ ఓ వీడియోను రిలీజ్‌ చేశాడు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వయస్సు 30 దాటింది.. పొట్ట, జుట్టు.. చాలా కష్టాలు వచ్చాయి.. ఇంకా రెండు రోజులే ఉంది. అల్లానికి పెళ్లాన్ని వెతికి పెట్టండి. #HelpAllamFindPellam హ్యాష్‌ట్యాగ్‌తో సూచనలు చేయండంటూ వీడియోలో చెప్పాడు. మరీ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ రెండు రోజుల తర్వాత ఏం చెబుతారో చి చూడాల్సిందే. అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు విద్యా సాగర్‌ చింత దర్శకత్వం వహిస్తున్నాడు.
Next Story
Share it