నేను క్షేమంగానే ఉన్నా: శర్వానంద్

Hero Sharwanand who Responded to the Accident. హైదరాబాదులో టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ కారుకు ఈ ఉదయం ప్రమాదం జరిగింది.

By Medi Samrat
Published on : 28 May 2023 5:00 PM IST

నేను క్షేమంగానే ఉన్నా: శర్వానంద్

హైదరాబాదులో టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ కారుకు ఈ ఉదయం ప్రమాదం జరిగింది. ఆయన పరిస్థితి ఎలా ఉందా అని అభిమానులు ఆందోళన చెందుతూ ఉండగా.. తాజాగా శర్వానంద్ స్పందించారు. జరిగింది చిన్న ప్రమాదమేనని.. తాను క్షేమంగానే ఉన్నానని, తనకు ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేశారు. తన గురించి బాధపడొద్దని... అందరి ప్రేమ, దీవెనలతో తాను క్షేమంగానే ఉన్నానంటూ శర్వానంద్ ట్వీట్ చేశారు. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. ఈ తెల్లవారుజామున ఫిలింనగర్ జంక్షన్ వద్ద శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు రోడ్ డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కారు డ్రైవర్ కు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించారు. డ్రైవర్ మద్యం సేవించలేదని తెలిసింది.

ఆదివారం ఉదయం 3 గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఫిల్మ్ నగర్ జంక్షన్ వద్ద ఆయన ప్రయాణిస్తున్న బ్లాక్ రేంజ్ రోవర్ కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో శర్వానంద్‌కు, కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో అక్కడున్న వారు అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలియగానే శర్వానంద్ కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. మరోవైపు కారును కూడా అక్కడి నుంచి తీసుకెళ్లారు.


Next Story