రామ్ సినిమా టీవీల్లో అయినా ఆకట్టుకునేనా.. టెలీకాస్ట్ ఎప్పుడంటే

Hero Ram The Warrior Movie. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన సినిమా 'ది వారియర్‌'. లింగుసామి దర్శకత్వం వహించిన

By Medi Samrat  Published on  25 Oct 2022 7:10 PM IST
రామ్ సినిమా టీవీల్లో అయినా ఆకట్టుకునేనా.. టెలీకాస్ట్ ఎప్పుడంటే

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన సినిమా 'ది వారియర్‌'. లింగుసామి దర్శకత్వం వహించిన ఈ ద్విభాషా చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటించింది. ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మొదటి రోజు రామ్ కెరీర్ లో మంచి వసూళ్లు వచ్చిన సినిమాగా నిలిచినప్పటికీ లాంగ్ రన్ లో సినిమా కలెక్షన్ సాధించడంలో విఫలమైంది. ప్రోమోలు, సాంగ్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికీ.. సినిమా మాత్రం సెకండాఫ్ రొటీన్ అనే కామెంట్స్ వినపడ్డాయి. ముఖ్యంగా హీరోగా రామ్ కు.. విలన్ గా ఆది పిని శెట్టికి మంచి మార్కులు పడ్డాయి.

3 నెలల క్రితం విడుదలైన ఈ యాక్షన్ డ్రామా ఇక టీవీలలో విడుదల కాబోతోంది. ప్రముఖ టీవీ ఛానెల్ 'స్టార్ మా' ఈ చిత్రాన్ని అక్టోబర్ 30, 2022న సాయంత్రం 6 గంటలకు ప్రీమియర్‌ చేయనుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సినిమా టీవీ వీక్షకులకు ఎలాంటి అనుభూతిని అందిస్తుందో ఇంకొద్దిరోజులలో తెలిసిపోనుంది. కొన్ని సినిమాలు థియేటర్లలో ప్లాప్ అయినా.. బుల్లితెర మీద బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే..!


Next Story