క్షమాపణలు చెప్పిన హీరో నిఖిల్

Hero Nikhil Siddharth Has Publicly Apologized For Spy Movie. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘స్పై’. గ్యారీ బీహెచ్ ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ

By Medi Samrat  Published on  5 July 2023 10:00 PM IST
క్షమాపణలు చెప్పిన హీరో నిఖిల్

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘స్పై’. గ్యారీ బీహెచ్ ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ మూవీ భారీ అంచనాలతో జూన్ 29న విడుదలైంది. అయితే ఈ సినిమా ఫినిషింగ్ సరిగా లేదనే విమర్శలు కూడా వచ్చాయి. గ్రాఫిక్స్ విషయంలో కూడా సరైన చర్యలు తీసుకోలేదని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా కార్తికేయ 2 తో పాన్ ఇండియా క్రేజ్ ను సంపాదించుకున్న నిఖిల్.. ఈ సినిమాను హిందీ మార్కెట్ లోకి తీసుకుని వెళ్లలేకపోయాడు. అయితే మొదటి మూడు రోజులు సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. మొదటి రోజు రూ.11.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించగా నిఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫస్ట్‌డే గ్రాసర్‌గా నిలిచింది. ఇక ఇప్పటివరకు మొత్తం రూ.25 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

తాజాగా హీరో నిఖిల్ ఇతర భాష అభిమానులకు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కార్తికేయ 2’ సినిమాను బాగా ఆదరించారు. ‘స్పై’ చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోందని అనుకున్నాం. కానీ కొన్ని కారణాలవల్ల ఈ సినిమా ఇతర భాషలలో విడుదలకు నోచుకోలేదన్నారు. ఇందుకుగాను అభిమానులను క్షమాపణలు కోరుతున్నానని నిఖిల్ తెలిపారు. నాపై నమ్మకం ఉంచి చాలా మంది అభిమానులు అడ్వాన్స్‌ బుకింగ్‌ ద్వారా టికెట్లు కొన్నారు. దీంతో నా కెరియర్‌లోనే బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌ ఇచ్చారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. కానీ ఇదే సమయంలో కొంత బాధగా కూడా ఉంది. కాంట్రాక్ట్, కంటెంట్ విషయాల్లో వచ్చిన సమస్యల కారణంగా పాన్‌ ఇండియా స్థాయిలో సినిమాను ​ విడుదల చేయలేకపోయాం. చివరకు ఓవర్సీస్​లో కూడా 350 వరకు తెలుగు ప్రీమియర్ షోలు రద్దయ్యాయన్నారు. హిందీ, కన్నడ, తమిళం, మలయాళ ప్రేక్షకులందరికీ నేను క్షమాపణలు తెలియజేస్తున్నాను. నా నుంచి రాబోయే 3 సినిమాలను అన్ని భాషల్లోని థియేటర్‌లలో ఖచ్చితంగా అనుకున్న సమయానికే రిలీజ్ అవుతాయని మాట ఇస్తున్నాను. నాపై నమ్మకం ఉంచిన తెలుగు సినిమా అభిమానులకు కూడా మాట ఇస్తున్నాను. ఇక నుంచి సినిమా క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీపడను. నాపై ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా కూడా మీకు మాత్రం మంచి కంటెంట్‌ ఉన్న సినిమాను అందిస్తానని నిఖిల్​ లేఖలో తెలిపారు.


Next Story