హీరో నిఖిల్ ఎందుకు ఏడ్చాడు..?
Hero Nikhil Reacts On Karthikeya-2 Releasing Issue. యంగ్ హీరో నిఖిల్ 2014లో నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో
By Medi Samrat Published on 1 Aug 2022 6:31 PM IST
యంగ్ హీరో నిఖిల్ 2014లో నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన 'కార్తికేయ' సినిమాకు సీక్వెల్‌గా 'కార్తికేయ 2' రాబోతోంది. ఇందులో నిఖిల్‌కు జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ మూవీ అనేక వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'కార్తికేయ 2' సినిమా విడుదల విషయంలో అనేక సమస్యలు ఏర్పడ్డాయని, ఒకానొక సమయంలో ఏడ్చానని నిఖిల్ చెప్పుకొచ్చాడు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చే సినిమాలను ఇటు అటు నెట్టేస్తారని అంటారు కదా.. అలానే మా సినిమాకు జరిగిందని.. రిలీజ్ డేట్ ఆగస్ట్ 12 అని ప్రకటించేటప్పుడు కూడా కొందరు వద్దని చెప్పారట..! అక్టోబర్ లో రిలీజ్ చేసుకోండి.. నవంబర్ లో రిలీజ్ చేసుకోండి.. మీ సినిమా రిలీజ్ అవ్వదు. మీకు షోస్ దొరకవు. థియేటర్లు ఇవ్వమన్నారని చెప్పడంతో తాను ఏడ్చానన్నాడు నిఖిల్.
నేను నిజానికి చాలా స్ట్రాంగ్ పర్సన్‌ను.. హ్యాపీ డేస్ సినిమా నుంచి ఇప్పటివరకు మూవీ విడుదల కాదు, థియేటర్లు దొరకవు అని ఎప్పుడు అనిపించలేదన్నారు. ఒక వారం క్రితం అయితే ఏడ్చేశాను. చివరికి మా నిర్మాతలు విశ్వ ప్రసాద్, అభిషేక్ సపోర్ట్‌తో పట్టుబట్టి ఆగస్టు 12కే వస్తున్నామని ప్రకటించామని నిఖిల్ చెప్పుకొచ్చాడు. నిఖిల్ వరుసగా అద్భుతమైన ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టాడు. అనుపమ పరమేశ్వరన్ సరసన 18 పేజెస్ లో కూడా కనిపించనున్నాడు. 'స్పై' పేరుతో పాన్-ఇండియా ప్రాజెక్ట్ కూడా రాబోతోంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కాబోతోంది.